రూ.20 కోట్ల‌తో కేసీఆర్ బ‌యోపిక్

బ‌యోపిక్‌ల ప్ర‌స్తావ‌న ఎప్పుడు వ‌చ్చినా కేసీఆర్ బ‌యోపిక్ కూడా… చ‌ర్చ‌కు వ‌స్తుంది. కేసీఆర్ బ‌యోపిక్ తీస్తాం.. అని అప్ప‌ట్లో చాలామంది ప్ర‌క‌టించారు. కానీ.. ఎవ్వ‌రూ ఆ ప్ర‌య‌త్నాలు చేసిన దాఖ‌లా లేదు. ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మ‌ధుర శ్రీ‌ధ‌ర్ సైతం కేసీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని చెప్పారు. కానీ.. ఆ ప్రాజెక్టు గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ ముందుకు క‌ద‌ల‌లేదు.

అయితే ఈ బ‌యోపిక్ గురించి మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ఇప్పుడు స్పందించారు. త‌ప్ప‌కుండా ఈ బ‌యోపిక్ తీస్తాన‌ని, స్క్రిప్టు కూడా రెడీ అయ్యింద‌ని ప్ర‌క‌టించారు. ”కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయి నాయ‌కుడు. ఆయ‌న జీవిత క‌థ తీయ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. పాన్ ఇండియా స్థాయిలో చేయాలి. క‌నీసం 20 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. బ‌డ్జెట్‌ని స‌మకూర్చుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. కేసీఆర్ రూపు రేఖ‌ల‌కు త‌గిన న‌టుడ్ని వెదికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నాం. ఇవ‌న్నీ కుదిరాక‌… ఈ సినిమా మొద‌లెడ‌తాం” అని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close