రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా ఇస్తున్నారు. కానీ.. ఆ వాతావ‌ర‌ణం ఏమీ క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. టాప్ పొజీష‌న్‌లో ఉన్న క‌థానాయిక‌లు `ఇంత ఇస్తేనే చేస్తాం` అంటూ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కూర్చుంటున్నారు. హీరోల ప‌క్క‌న సరైన హీరోయిన్ల‌ని వెదికి ప‌ట్టుకోవ‌డమే గ‌గ‌నం అయిపోతోంది. అలాంటిది దొరికిన హీరోయిన్ తో బేరాలేం ఆడ‌తారు..? అందుకే… వాళ్లు చెప్పిన దానికి ఊ కొట్ట‌క త‌ప్ప‌డం లేదు.

ఈమ‌ధ్య చాలామంది హీరోయిన్లు త‌మ పారితోషికాల్ని పెంచేశారు. ఆ జాబితాలో ర‌ష్మిక కూడా చేరిపోయింది. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న `ఆడాళ్లూ మీకు జోహార్లూ` సినిమా కోసం ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ర‌ష్మిక‌.. త‌న సినీ జీవితంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకోబోతోంద‌ట‌. త‌న పారితోషికం ఇంచుమించుగా.. 1.75 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హీరోలూ, హీరోయిన్లూ 20 నుంచి 30 శాతం వ‌ర‌కూ పారితోషికాల్ని త‌గ్గించుకోవాల‌ని చెబుతున్నారు. లాక్ డౌన్‌కి ముందున్న పారితోషికాల‌లో 30 శాతం కోత విధించాలి. ఆ లెక్క‌న ర‌ష్మిక‌కు కోటి కూడా ఇవ్వ‌కూడ‌దు. కానీ.. ఏకంగా 1.75 కోట్లు ముట్ట‌జెప్పాల్సివ‌స్తోంది. త‌న పారితోషికం 2 కోట్లు డిమాండ్ చేసి, అందులో.. 25 ల‌క్ష‌లు ర‌ష్మిక రిబేటు ఇచ్చింద‌ని, తాను త‌గ్గించిన పారితోషికం అదేన‌ని ఇండ్ర‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close