క్రేజీ మూవీ: భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వేంద్ర‌రావు

సెంచ‌రీ సినిమాల ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. `న‌మో వెంక‌టేశ‌` త‌ర‌వాత ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. `పెళ్లి సంద‌డి 2` చేస్తున్నా, ఆయ‌న‌ది కేవ‌లం ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్ర‌మే. తాజాగా ఆయ‌న కెమెరా ముందుకు రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులోనూ హీరోగా. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కథా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, ఈ సినిమాలో న‌టించ‌డానికి రాఘ‌వేంద్ర‌రావు ఓకే చెప్పార‌ని స‌మాచారం.

ప్ర‌ధాన నాయ‌కుడు పాత్రే అయినా.. కె.రాఘ‌వేంద్ర‌రావు స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఆ పాత్ర హుందాగా ఉండ‌బోతంద‌ని తెలుస్తోంది. `పింక్‌`, `చీనీక‌మ్‌`, `బ్లాక్‌` చిత్రాల్లో క‌థానాయ‌కుడి పాత్ర ఎంత ఉదాత్తంగా ఉంటుందో.. అలానే ఈ సినిమాలోనూ రాఘ‌వేంద్ర‌రావు పాత్ర ఆ స్థాయిలో ఉంటుంద‌ని, అందుకే ద‌ర్శ‌కేంద్రుడు కూడా ఈ క‌థ‌కు ఓకే చెప్పార‌ని స‌మాచారం. `మిథునం` త‌ర‌వాత త‌నికెళ్ల భ‌ర‌ణి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు. `మిథునం` లానే ఈ క‌థ కూడా చాలా హృద్యంగా సాగ‌బోతోంద‌ని వ‌చ్చే యేడాది ప్ర‌ధ‌మార్థంలో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close