స‌ర్కారు వారి ‘బ్యాంకు’ దొరికింది

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. అన్నీ స‌రిగా ఉంటే.. ఈ పాటికి అమెరికాలో షూటింగ్ మొద‌లైపోయేది. వీసాలు రావ‌డం స‌మ‌స్య‌గా మార‌డంతో అక్క‌డి షెడ్యూల్ వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో కీల‌క‌మైన షెడ్యూల్ మొద‌లు కాబోతోంది. ఈ సినిమా లో ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ బ్యాంకు నేప‌థ్యంలో సాగుతుంది. అదీ.. అమెరికా బ్యాంకు. అందుకోస‌మే అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ బ్యాంకు సెట్‌.. హైద‌రాబాద్ లో వేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బ్యాంకు సెట్ కి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. బ్యాంకు ఎక్స్‌టీరియ‌ర్ కి సంబంధించిన స‌న్నివేశాల్ని అమెరికాలోనే తీస్తారు. అందుకు సంబంధించిన బ్యాంకు కూడా.. అమెరికాలో దొరికేసింది. ఆ బ్యాంక ఇంటిరీయ‌ర్ కి త‌గ్గ‌ట్టుగానే రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్ తీర్చిదిద్దుతున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్రతినాయ‌కుడి పాత్ర కోసం చాలా పేర్లు వినిపించాయి. ఉపేంద్ర‌, అర‌వింద్ స్వామి, అనిల్ క‌పూర్‌.. ఇలా కొంత‌మంది స్టార్ల పేర్లు ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఓ పేరు ఖ‌రారు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close