ప‌వ‌న్ – హరీష్‌.. ట్యూను రెడీ!

గ‌బ్బ‌ర్ సింగ్.. ఈ పేరు చెబితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు పుల‌కించి పోతారు. ప‌వ‌న్ కెరీర్‌లో అతి పెద్ద హిట్స్‌లో అదొక‌టి. పైగా… వ‌రుస ప‌రాజ‌యాల‌కు బ్రేక్ కొడుతూ ప‌వ‌న్ స్టామినాని చూపించిన సినిమా. ఆసినిమాతోనే హ‌రీష్ శంక‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దానికి సంబంధించిన ప‌నులూ మొద‌లైపోయాయి. ప్ర‌స్తుతం దేవిశ్రీ ప్ర‌సాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. దేవి ఓ ట్యూను సిద్ధం చేశాడ‌ని, అది ప‌వ‌న్ కీ, హ‌రీష్‌కి నచ్చేశాయ‌ని తెలుస్తోంది.

ఇదో పోలీస్ క‌థ అని, గ‌బ్బ‌ర్ సింగ్ కి సీక్వెల్ అనీ, ప‌వ‌న్ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అవేం నిజాలు కావ‌ని తేలిపోయింది. గ‌బ్బ‌ర్ సింగ్ కీ ఈ సినిమాకీ అస్స‌లు సంబంధ‌మే లేదు. ద్విపాత్రాభిన‌యం కూడా కాదు. ప‌వ‌న్ సోలో హీరోనే. ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌ని పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపిస్తాడ‌ని హ‌రీష్ చెబుతున్నారు. 2021లోనే ఈప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీసామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి లేవనెత్తిన...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close