ఎన్నికలపై ఓవర్ టైం వర్క్ చేస్తున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన పండుగ మూడ్‌లో లేరు. అసలు సంక్రాంతిని పట్టించుకోకుండా… పూర్తిగా పార్టీ పనిపైనే దృష్టి పెట్టారు. మూడు రోజులుగా ఆయన సిరిసిల్ల దగ్గర్నుంచి సాగర్ వరకూ కీలకమైన.. అత్యవసరమైన నియోజకవర్గాల నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కొన్నాళ్లుగా గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీలో ఉండాలనే తపనతో  ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారు. ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో వారిదే హవా. దీంతో ఎప్పటి నుండో కేటీఆర్ వెంట ఉన్న వాళ్లకు ఆదరణ లేకుండా పోయింది. ఈ విబేధాలు ముదిరిపోతూండటంతో కేటీఆర్ అందర్నీ హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడి సర్ది చెప్పారు.

ఆ తర్వాత శాసనమండలికి జరగనున్న ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. అటు దుబ్బాక ఉపఎన్నిక ఇటు.. గ్రేటర్ ఎన్నికల్లో పడిన దెబ్బతో… మరో ఓటమి ఎదురైతే.. ఇమేజ్ మరింతగా దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు.  అందుకే మండలి ఎన్నికలపై ప్రత్యేకగా దృష్టి పెట్టారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి వారి మెప్పును పొందేందుకు ఉద్యోగాలభర్తీ సహా అనేక కార్యక్రమాలు ప్రకటించారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల విషయంలోనూ నేతలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు రోజులుగా సమావేశాలతో అందర్నీ పిలిపించి… దిశానిర్దేశం చేసి పంపించారు.

వీటన్నింటితో పాటు టీఆర్ఎస్‌ను వెంటాడుతున్న మరో గండం నాగార్జున సాగర్ ఉపఎన్నిక. ఈ విషయంలోనూ.. కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే… ఈ ఉపఎన్నికపై రకరకాల ప్రచారాలుసాగుతున్నాయి. కాంగ్రెస్ ను గెలిపించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. జానారెడ్డి మళ్లీ పోటీకి సిద్ధమవడం వెనుక.. కేసీఆర్ అభయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా రాజకీయ కుట్రేనని… టీఆర్ఎస్ అభ్యర్థే అక్కడ విజయం సాధిస్తారన్న నమ్మకంతో కేటీఆర్ ఉన్నారు. అందుకే… ఇప్పటికే ప్రభుత్వం తరపున పలు పథకాలు ప్రకటించారు. ఇప్పుడు కేటీఆర్… ప్రత్యేకంగా దృష్టి సారించి.. గ్రామాల వారీగా వ్యూహరచన చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్… ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోలేకపోయారు. ఈ ఎన్నికలన్నింటిలో గెలిచి.. వచ్చే సంక్రాంతిని ఫుల్ జోష్‌లో జరుపుకోవాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close