మ‌హేష్ – త్రివిక్ర‌మ్ మూవీ… 2022 వేస‌వి టార్గెట్

అత‌డు, ఖ‌లేజా త‌ర‌వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నారు. ఈ కాంబినేష‌న్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని…. హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నుంది. 2022 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు.. చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈనెల 31..న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డు, ఖ‌లేజా చిత్రాల‌ను ఆయ‌నే సంగీతం అందించారు. అందుకే అదే కాంబినేష‌న్ ని రిపీట్ చేయాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ఉద్దేశం. అయితే అధికారిక ప్ర‌క‌ట‌న‌లో మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలేం లేవు. అత‌డు త‌ర‌హాలోనే కుటుంబ బంధాల నేప‌థ్యంలో ఈ చిత్రం సాగబోతోంద‌ని, యాక్ష‌న్‌కి సైతం పెద్ద పీట వేస్తున్నార‌ని తెలుస్తోంది. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close