ఈవారం బాక్సాఫీసు: మ‌ళ్లీ ‘పాంచ్’ ప‌టాకా

పెద్ద సినిమాలు లేవు. మీడియం రేంజు సినిమాలు రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌ల‌కు ధైర్యం చాల‌ట్లేదు. దాంతో చిన్న చిత్రాల‌కు బోల్డంత ఖాళీ దొరికేసింది. ఈ సీజ‌న్‌ని అవి బాగా వాడుకుంటున్నాయి కూడా. ప్ర‌తీ వారం.. నాలుగైదు సినిమాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. అందులో ఎన్ని హిట్స్‌, ఎన్ని ఫ్లాపులు అనేవి ప‌క్క‌న పెడితే – థియేట‌ర్ల ద‌గ్గ‌ర మాత్రం కొత్త పోస్ట‌ర్లు త‌ళ‌త‌ళ‌లాడుతూ ఆహ్వానిస్తున్నాయి. ఈ వారం కూడా 5 సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మయ్యాయి.

అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం `101 జిల్లాల అంద‌గాడు`. బ‌ట్ట‌త‌ల‌తో ముడిప‌డిన క‌థ ఇది. బ‌ట్ట‌త‌ల వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయో వినోదాత్మ‌కంగా చూపించ‌బోతున్నారు. ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. సినిమా ప్ర‌చారం సైతం వైవిధ్యంగా సాగుతోంది. ఇదే కాన్సెప్టుతో బాలీవుడ్ లో`బాలా` అనే సినిమా వ‌చ్చింది. ఆ క‌థ‌కూ, ఈ క‌థ‌కూ ఉన్న లింకేమిటో.. తెర‌పైనే చూడాలి. ఈ సినిమా సెప్టెంబ‌రు 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అదే రోజున `డియ‌ర్ మేఘా` కూడా విడుద‌ల కానుంది. మేఘా ఆకాష్ క‌థానాయిక‌గా న‌టించిన సినిమా ఇది. అరుణ్ అతిథ్‌, అర్జున్ సోమ‌యాజుల క‌థానాయిక‌లు. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ చిత్ర‌మిది. ఎమోష‌న్స్ పీక్స్ లో ఉంటాయ‌న్న సంగ‌తి ట్రైల‌ర్ చూస్తేనే అర్థం అవుతోంది. హ‌రి గౌర అందించిన ట్యూన్లు కూడా క్యాచీగా ఉన్నాయి.

వీటితో పాటుగా కిల్ల‌ర్‌, అప్పుడు – ఇప్పుడు, అశ్మీ చిత్రాలు ఈ వారంలోనే రాబోతున్నాయి. చిన్న చిత్రాల సంద‌డి ఈ నెలంతా క‌నిపించే అవ‌కాశం ఉంది. క‌నీసం 20 నుంచి 25 చిత్రాలు సెప్టెంబ‌రులో విడుద‌ల కానున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close