తరుణ్, పూరిల శాంపిల్స్‌లో డ్రగ్స్ లేవట..! అందరివీ లేనట్లేగా ?

నాలుగేళ్ల కిందట తీసుకున్న శాంపిల్స్‌ టెస్టుల ఫలితాలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కోర్టుకు సమర్పించింది. తరుణ్ , పూరి జగన్నాథ్‌ల నుంచి సేకరించిన గోళ్లు, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్‌లోని 2017లోనే ఎఫ్ఎస్ఎల్‌ ల్యాబ్‌కు పంపారు. తర్వాత ఆ కేసు మరుగున పడిపోయింది. ఇప్పుడు ఈడీ విచారణ ప్రారంభించడంతో మళ్లీ తెరపైకి తెచ్చారో లేకపోతే ఎందుకైనా మంచిదని తారలందరికీ క్లీన్ చిట్ ప్రకటించేద్దామని అనుకుంటున్నారో కానీ.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్.. ఎఫ్ఎస్ఎల్ ఉన్నతాధికారి వాంగ్మూలాలను కూడా కలిపి కోర్టుకు సమర్పించారు.

ఈ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లాలో కెల్విన్‌ను డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖులందర్నీ వరుసగా పిలిచి పోలీసులు విచారణ దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. 2017 డిసెంబర్ నుంచి చార్జిషీట్లు వేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2018 జూలైలో.. నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని.. వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయన్న ప్రచరం జరిగింది. చివరికి 2019 మేలో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో సినీ తారల పేర్లు ఎవరివీ లేవు.

ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ ఎవరి పేర్లు లేవు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లుగా కూడా వివరాలు లేవు. అంటే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ తాజాగా నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది. ఈడీ దూకుడు నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close