చిరు స్పీడుకి కార‌ణం ఇదేనా?

ఓ అగ్ర హీరో చేతిలో 4 చిత్రాలు ఉండ‌డం, నాలుగూ ఒకేసారి షూటింగ్ జ‌రుపుకోవ‌డం రికార్డే. ఆ రికార్డు.. ఇప్పుడు చిరంజీవి పేరుమీదుంది. ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, బాబీ సినిమా.. ఇవి నాలుగూ హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఆ నాలుగు సినిమాల‌కూ చిరు ఈ నెల‌లో డేట్లు కేటాయించారు. అలా.. చిరు కెరీర్‌లో ఎప్పుడూ చూడ‌ని దృశ్యానికి ఈ డిసెంబ‌రు వేదిక అయ్యింది.

నిజానికి చిరుకి ఇంత హ‌ర్రీ బ‌ర్రీగా సినిమాలు చేయాల‌ని ఉండ‌దు. సినిమా త‌ర‌వాత సినిమా అనేది త‌న పాల‌సీ. దాదాపు అగ్ర హీరోలంతా అదే పాటించారు. అర‌వై ఏళ్లు దాటిన త‌ర‌వాత‌.. కెరీర్‌ని ఇంత స్పీడుగా ప‌రుగులు పెట్టించాల‌ని అనుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. అయితే ఈ స్పీడు వెనుక ఓ ప్ర‌ధాన కార‌ణం ఉంది. ఆ కార‌ణం పేరు సుస్మిత‌. చిరు కుమార్తె సుస్మిత ఇప్పుడు చిరుకి సంబంధించిన స‌మ‌స్త‌మైన విష‌యాల్నీ చూసుకుంటున్నారు. ఆచార్య మిన‌హాయిస్తే.. మిగిలిన మూడు ప్రాజెక్టులు సెట్ చేయ‌డం వెనుక సుస్మిత హ‌స్తం ఉంది. చిరు పారితోషికాలు డీల్ చేయ‌డం ద‌గ్గ‌ర్నుంచి, డేట్లు స‌ర్దుబాటు చేయ‌డం వ‌ర‌కూ అన్ని విష‌యాల‌నూ ఆమే ద‌గ్గ‌రుండి చూసుకుంటోంద‌ట‌. చిరు వ‌య‌సు పెరుగుతోంది. మ‌హా అయితే మ‌రో రెండు మూడేళ్లు ఇంత స్పీడుగా సినిమాలు చేసే అవ‌కాశం ఉంది. త‌ర‌వాత ఎలాగూ… యేడాదికి ఒక‌టీ, అర అంటూ ప‌రిమితం కావాల్సిందే. త‌ప్ప‌దు. అందుకే… ఓపిక ఉన్న‌ప్పుడే చ‌క‌చ‌క సినిమాలు చేసేయ్య‌మ‌ని.. సుస్మిత స‌ల‌హా ఇచ్చింద‌ట‌. చిరు డైట్ కూడా త‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటోంద‌ట‌. అందుకే చిరు కూడా కుర్రాడిలా సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపించేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close