కార్యకర్తల నేతగా ఎదిగిన లోకేష్ !

టీడీపీ యువ నేత నారా లోకేష్ కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ ఆయన పుట్టిన రోజును మాత్రం టీడీపీ కార్యకర్తలు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఉత్సాహం గతంలో ఎప్పుడూ లేదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలా వేడుకలు చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని మరీ రాజకీయం చేస్తున్న లోకేష్… ఆ ఫలితాన్ని కొంత మేర చూస్తున్నారని అనుకోవచ్చు. పార్టీ అధికారలోకి లేకపోతే.. పార్టీ ముఖ్య నేతల పుట్టిన రోజులు కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతూ ఉంటాయి. అదీ ఎన్నికలు మరో రెండేళ్ల తర్వాత అయితే శుభాకాంక్షలతో సరి పెడతారు.

కానీ ఇప్పుడు లోకేష్ పుట్టిన రోజంటే టీడీపీలో ఓ ఉత్సాహం కనిపిస్తోంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉందనే నమ్మకాన్ని ఎక్కువ మందికి లోకేష్ కల్పించగలిగారు. క్లీన్ షేవ్‌తో రాముడి మంచి బాలుడిగా కనిపించే గెటప్ .. మన రాజకీయాలకు సెట్ కాదని లోకేష్ తెలుసుకున్న తర్వాత సీన్ మారిపోయిందని అనుకోవచ్చు. గడ్డం పెంచి.. వాయిస్‌లో బేస్ మార్చి…లోకేష్ తన రాజకీయ రాతను కూడా మార్చుకున్నారని అనుకోవచ్చు. ఆ మధ్య జనంలోకి విస్తృతంగా వెళ్లినా ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.

కానీ తెర వెనుక మాత్రం రోజువారీ కసరత్తులు సుదీర్ఘంగా నిర్వహిస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు లోకేష్ పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. అదే గతంలో ఆయనకు లేని యాక్సెప్టెన్స్‌ను తీసుకు వచ్చింది. ఒక్క సారిగా ఎదిగిపోయే నేతలెవరూ సర్వైవ్ అయిన దాఖలాలు లేవు. .. కానీ ఓటమితో ప్రారంభించి.. మెల్లగా అడుగులు వేసే నేత .. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటారు. అది లోకేష్ విషయంలో నిజమయ్యే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close