ప్ర‌భాస్ క్వ‌శ్చ‌న్ : ఇన్ స్టా రీల్స్‌.. అన‌గానేమి?

వ‌రుస ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్ల‌తో ప్ర‌భాస్ దుమ్ము దులుపుతున్నాడు. ఆదివారం అంతా టీవీ ఛాన‌ళ్ల‌తోనే గ‌డిపేశాడు ప్ర‌భాస్‌. సోమ‌వారం… ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ త‌ర‌వాత ఢిల్లీ, కొచ్చిన్ వెళ్లాలి. ఈలోగా అడిగిన‌వాళ్ల‌కు, అడ‌గ‌ని వాళ్ల‌కు కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. యాంక‌ర్ల‌తో ఓపిగ్గా మాట్లాడుతున్నాడు. ఫొటోలకు పోజులిస్తున్నాడు. అయితే… టీవీ ఇంట‌ర్వ్యూల సంద‌ర్భంగా ఓ స‌ర‌దా సంఘ‌ట‌న జ‌రిగింది. ఇంట‌ర్వ్యూ అంతా అయిపోయాక‌.. ఓ యాంక‌ర్ భామ `మీతో ఇన్ స్టా రీల్స్ చేయాల‌ని వుంది.. ఛాన్స్ ఇస్తారా` అని ఉత్సాహంగా అడిగింది. దాంతో ప్ర‌భాస్‌.. `రీల్సా.. అంటే ఏమిటి` అని అడిగాడు.

‘ఇన్ స్టా రీల్స్ సార్‌… ‘ అంటూ ప్ర‌భాస్ స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తున్నాడేమో అని.. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే చెప్పుకొచ్చింది యాంక‌ర్‌. ‘నాకు ఇన్ స్టా రీల్స్ అంటే ఏమిటో తెలీదు..’ అని ప్ర‌భాస్ అన‌గానే, ప‌క్క‌నున్న పీఆర్‌టీమ్ అస‌లు రీల్స్ అంటే ఏమిటో పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. అదంతా తెలుసుకున్నాక‌.. ‘ఇలాంటివి వ‌ద్దు త‌ల్లోయ్‌’ అంటూ న‌వ్వుతూనే అక్క‌డి నుంచి జారుకున్నాడు ప్ర‌భాస్‌. నిజంగానే ప్ర‌భాస్ కి ఈ సోష‌ల్ మీడియా గురించి పెద్ద‌గా ప‌రిజ్ఞానం లేదు. ఈమ‌ధ్యే ఇన్‌స్టాలో అడుగుపెట్టాడు ప్ర‌భాస్‌. సినిమాల కోస‌మే ఫేస్ బుక్ ఎకౌంట్లు తెరిచాడు. సౌత్ ఇండియాలోనే ఇన్‌స్టాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న స్టార్ల‌లో ప్ర‌భాస్ ఒక‌డు. అలాంటిది ప్ర‌భాస్ కి ఇన్ స్టా రీల్స్ గురించి తెలియ‌క‌పోవ‌డం ఆశ్చర్య‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close