అనుకొన్నట్టే ‘పెద్ది’ వాయిదా పడింది. ఏప్రిల్ 30న ఈ సినిమా రావడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ లో ఈ సినిమాని విడుదల చేస్తామన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, రిలీజ్ డేట్ ఇప్పటికీ ఎనౌన్స్ చేయకపోవడం. జూన్లో ఏ డేట్ న ‘పెద్ది’ కోసం అట్టి పెట్టుకొన్నారన్నది సస్పెన్స్. ఇప్పుడు జూన్లో రావాలనుకొన్న సినిమాలన్నీ డైలామాలో పడతాయి. ‘పెద్ది’ కోసం తమ సినిమాల్ని త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎలాగూ రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఈసారైనా క్లియర్ కట్ గా రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటే బాగుండేది. అదీ జరగలేదు.
నవంబరు 2024లో ఈ సినిమా మొదలైంది. 2026 జూన్లో వస్తోంది. అంటే 20 నెలల పాటు షూట్ చేశారన్నమాట. మేకింగ్ విషయంలో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ నే ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఆయన కూడా ఇలానే సినిమాని చెక్కుకొంటూ పోతుంటారు. శిష్యుడు బుచ్చిబాబు కూడా ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. రామ్ చరణ్ సినిమా అంటే మేకింగ్ విషయంలో అంత టైమ్ తీసుకోవాల్సిందే. కానీ యువ దర్శకులు కూడా సినిమాకి ఇంతింత టైమ్ తీసుకోవడం ఏమాత్రం భావ్యం కాదు.
నిర్మాతలు ‘పెద్ది’ మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. అందుకే ఇంత టైమ్ పడుతుందేమో అనిపిస్తోంది. ఇప్పటి వరకూ షూటింగ్ ఎంత వరకూ వచ్చింది, ఇంకెంత షూట్ చేయాలి? అనే విషయంలో కూడా మేకర్స్ ఓ అప్ డేట్ ఇస్తే బాగుండేది. ‘పెద్ది’ వాయిదా విషయంలో ఓక్లారిటీ ఇచ్చిన నిర్మాతలు, రిలీజ్ డేట్ ఎప్పుడో క్లియర్ గా చెప్పేస్తే ఫ్యాన్స్ రిలాక్సయిపోయేవారు. జూన్ అని చెప్పి డేట్ ప్రకటించకపోవడంతో.. ఈ సస్పెన్స్ ఇలానే కంటిన్యూ అవుతోంది.
