పాపం.. కార్తికేయ 2!

నిఖిల్ సినిమా `కార్తికేయ 2`కి క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. చాలాసార్లు ఈ సినిమాని వాయిదా వేసుకోవాల్సివ‌చ్చింది. మ‌రో సినిమాతో థియేట‌ర్ల కోసం పోటీ రాకుండా ఉండ‌డానికి విడుద‌ల తేదీ మార్చుకొన్నారు. ఎట్ట‌కేల‌కు ఈనెల 13న ఈ సినిమా వ‌స్తోంది. ఇప్ప‌టికీ.. థియేట‌ర్ల స‌మ‌స్య కొన‌సాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ వారం సీతారామం, బింబిసార వ‌చ్చాయి. రెండూ బాగానే ఆడుతున్నాయి. రోజు రోజుకీ వ‌సూళ్లు పెరుగుతున్నాయి. వ‌చ్చే వారం కూడా ఈ సినిమాలు ర‌న్నింగ్‌లో ఉంటాయి. త‌మ థియేట‌ర్ల‌ని వ‌దులుకోవ‌డానికి ఈ రెండు సినిమాలూ ఇష్ట‌ప‌డ‌వు.

పైగా 12న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం వ‌స్తోంది. రిలీజ్ డేట్‌ని ఎప్ప‌డో లాక్ చేసుకొన్న సినిమా ఇది. థియేట‌ర్ల‌కు కూడా బ్లాక్ అయిపోయాయి. సో.. ఉన్న థియేట‌ర్ల‌ని మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం లాగేసుకుంటుంది. మరోవైపు నుంచి లాల్ సింగ్ చ‌ద్దా ఉండ‌నే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాని భారీగానే విడుద‌ల చేస్తున్నారు. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్ ల‌ను టార్గెట్ చేసే సినిమా ఇది. ఇవ‌న్నీ పంచుకోగా మిగిలిన థియేట‌ర్ల‌తో కార్తికేయ 2 స‌ర్దుకోవాల్సివ‌స్తోంది. కార్తికేయ 2పై భారీగా ఖ‌ర్చు పెట్టారు. అదంతా రావాలంటే వీలైన‌న్ని ఎక్కువ థియేట‌ర్ల‌లో సినిమా రిలీజ్ చేయాలి. ప్ర‌స్తుత‌మైతే ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ అయితే.. విజువ‌ల్ ఫీస్ట్ గా, థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. ఆ ట్రైల‌రే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close