హ‌మ్మ‌య్య‌… నితిన్‌కి మూడొచ్చింది!

మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం త‌ర‌వాత నితిన్ సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. వ‌క్కంతం వంశీ క‌థ‌కు నితిన్ ప‌చ్చ జెండా ఊపిన‌ప్ప‌టికీ.. ఆ సినిమాని ఎందుక‌నో హోల్డ్ లో పెట్టాడు. ఈ క‌థ‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, క‌థ మారుతోంద‌ని, అందుకే లేట్ అవుతోంద‌ని ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి. ఈ సినిమా ఉంటుందా, లేదా? అనే అనుమానాలూ చుట్టుముట్టాయి. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. ఆదివారం నుంచి.. ఫ‌స్ట్ షెడ్యూల్ మొద‌లైంది. మారేడుమిల్లి అడ‌వుల్లో… ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. నితిన్‌పై ఓ యాక్ష‌న్ సీన్ తో ఈ షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్టారు. నితిన్ గెట‌ప్‌, త‌న బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త‌గా క‌నిపించ‌నున్నాయ‌ని స‌మాచారం. `జూనియ‌ర్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. హ‌రీశ్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీ‌లీల క‌థానాయిక‌. ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కోసం సూర్య‌, విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌తినాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేలుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close