‘పుష్ప 2’ రికార్డ్ కు ఆమ‌డ‌దూరంలో ‘స‌లార్‌’

రికార్డులు శాశ్వ‌తం కాదు. అవెప్పుడూ బ్రేక్ అవుతూనే ఉంటాయి. కాక‌పోతే.. రికార్డు సృష్టించ‌డానీ, దాన్ని బ్రేక్ చేయ‌డానికీ పెద్ద గ్యాప్ ఉండ‌డం లేదు. ఓ స్టార్ హీరో ఓ రికార్డ్ క్రియేట్ చేస్తే, ఆ వెంట‌నే వ‌చ్చిన మ‌రో స్టార్ హీరో సినిమా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. అయితే.. ఆడియో రైట్స్ విష‌యంలో ‘పుష్ప 2’ రికార్డ్ ఎవ్వ‌రూ బ్రేక్ చేయ‌లేరేమో అనిపిస్తోంది.

‘పుష్ప 2 ‘ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ ఏకంగా రూ.65 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఆడియో రైట్స్ విష‌యంలో ఇదే ఆల్ ఇండియా రికార్డ్‌! నిజానికి ఆడియో రైట్స్ ఇది వ‌ర‌క‌టంత జోరుగా లేదు. దాని వాల్యూ త‌గ్గిపోతున్న ద‌శ‌లో.. మ‌ళ్లీ ఆడియోరైట్స్‌కి రెక్క‌లొచ్చాయి. మా మాదిరి సినిమాకి సైతం కోట్ల‌లో బిజినెస్ జ‌రుగుతోంది. స్టార్ హీరో సినిమా అంటే మినిమం రూ.10 నుంచి రూ.20 కోట్లు ప‌లుకుతున్నాయి. ‘పుష్ప 2’ మాత్రం ఏకంగా రూ.65 కోట్లు తెచ్చుకొంది. ‘పుష్ప 1’లో పాట‌లు నేష‌న‌ల్ వైడ్ గా హిట్ట‌య్యాయి. కాబ‌ట్టి.. టీ సిరీస్ పార్ట్ 2 హ‌క్కుల‌పై భారీగా వ‌చ్చించింది. స‌లార్ ఆడియో రైట్స్ సైతం టీ సిరీస్ ద‌క్కించుకొంది. ఆడియో రైట్స్ రూపంలో రూ.28 కోట్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పుష్ప తో పోలిస్తే.. చాలా త‌క్కువ‌.

సుకుమార్ – దేవిశ్రీ ప్ర‌సాద్‌ల‌ది మ్యూజిక‌ల్ హిట్ కాంబో! వాళ్ల ఆడియో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. `స‌లార్‌` అలా కాదు. ఇదో యాక్ష‌న్ డ్రామా. ఇందులో పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్‌లేదు. కేజీఎఫ్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకొంటారు త‌ప్ప‌, పాట‌లు అంత‌గా గుర్తుండ‌వు. ప్ర‌శాంత్ నీల్ విజువ‌ల్స్‌,ఎమోష‌న్‌, హీరోయిజం… వీటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాడు. అది ఆయ‌న స్టైల్‌. కాబ‌ట్టి.. ఆడియో ప‌రంగా ఈ సినిమాకి పెద్ద‌గా క్రేజ్ లేదు. అందుకే రూ.28 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఈలోగా.. పాన్ ఇండియా స్థాయిలో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించే క్రేజీ సినిమా ఏదీ లేదు. కాబ‌ట్టి.. పుష్ప 2 రికార్డ్ కొన్నాళ్ల పాటు సేఫ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close