రాజమౌళి ‘డైనోసర్’ ఏమైంది?

ప్రభాస్ సలార్ విడుదలైయింది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రభాస్ కటౌట్ కి తగిన కథ పడిందని ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ వైల్డ్ యాక్షన్, ఎంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్, ప్రీక్లైమాక్స్ బ్లాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎంతలానో ఎదురుచూసిన డైనోసర్ సీక్వెన్స్ పార్ట్1 లో లేకపోవడం ఆశ్చర్యపరిచింది.

ప్రభాస్ ని డైనోసర్ తో పోలుస్తూ ఒక టీజర్ వదిలారు. ఆ టీజర్ సినిమాపై చాలా బజ్ ని క్రియేట్ చేసింది. అభిమానులే కాదు, స్వయంగా దర్శకుడు రాజమౌళి.. ఇందులో కేవలం డైనోసర్ సీక్వెన్స్ కోసమే సినిమాకి వెళ్తున్నానని, అంత అద్భుతమైన పోలిక తెచ్చిన ప్రశాంత్ నీల్ ఆ సీక్వెన్స్ ని ఎలా తీర్చిదిద్డుంటారో చూడాలని వుందని మొన్న జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే ఈ విషయంలో కాస్త నిరాశపరుస్తూ.. అసలు ఆ సీక్వెన్స్ లేకుండా పార్ట్ 1ని వదిలారు. నిజంగా ఆ సీక్వెన్స్ సలార్ కథలో ఉందా ? సెకండ్ హాఫ్ లో చూపిస్తారా? లేదా టీజర్ కోసమే దానిని స్పెషల్ గా షూట్ చేశారా? అనేది తెలియాల్సి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close