స‌రైనోడు.. ముందుకొచ్చాడు

ఏప్రిల్‌లో మెగా హీరోల సంద‌డిక‌నిపించ‌బోతోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అదే నెల‌లో… స‌రైనోడు కూడా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్నీ కుదిరితే సాయిధ‌ర‌మ్ తేజ్ సుప్రీమ్‌నీ ఏప్రిల్‌లోనే విడుద‌ల చేస్తారు. స‌ర్దార్ ఆడియో ఈనెల 20 న ఫిక్స‌య్యింది. ఇప్పుడు ప‌వ‌న్‌ని ఫాలో అవుతూ.. బ‌న్నీ కూడా త‌న పాట‌ల్ని వినిపించ‌బోతున్నాడు. అల్లు అర్జున్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొన్న స‌రైనోడు… షూటింగ్ తుది దశ‌కు చేరుకొంది. మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలూ షురూ అయ్యాయి.
ఇప్పుడు పాట‌ల విడుద‌ల తేదీ ఫిక్స‌య్యింది.

ఏప్రిల్ 2న ఆడియో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యం తీసుకొంది. అయితే వేదిక మాత్రం హైద‌రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నానికి షిఫ్ట్ చేశారు. నిజానికి ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా పాట‌ల్ని విడుద‌ల చేయాల‌నుకొన్నారు. అయితే ఆ రోజు స‌ర్దార్ సినిమా విడుద‌ల ఖాయ‌మ‌వ్వ‌డంతో.. బ‌న్నీ ఆడియో ఫంక్ష‌న్ ముందుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close