అంజలి బాగానే హోప్స్ పెట్టుకుంది..!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అంజలి స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా సరే మంచి ఐడెంటిటీని సంపాదించింది. ఇక వరుసెంట క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న అమ్మడు ఛాన్స్ వస్తే స్పెషల్ సాంగ్ కైనా ఓకే అనేస్తుంది. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ లో బన్నితో కలిసి స్టెప్పులేసింది. అయితే కెరియర్ పరంగా అంత జోష్ లో లేని అంజలి ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ తో హిట్ కొట్టేయడం ఖాయం అనేస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

తెలుగమ్మాయి అయినా కోలీవుడ్ లో మొదట ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కి లేట్ గా వచ్చిన అంజలి అనతి కాలంలోనే తనంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఏర్పాటుచేసుకుంది. అంతేకాదు స్పెషల్ సాంగ్స్ లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. శంకరాభరణంలో గంటా సాంగ్ సూపర్ హిట్ అయితే సినిమా ఫ్లాప్ అయ్యే సరికి అంజలి గురించి అంతగా బయటకు రాలేదు. కాని ఈ సరైనోడులో అంజలి చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ నిజంగానే ఇకనుండి అంజలి కెరియర్ ను బ్లాక్ బస్టర్ చేసేస్తుందని నమ్ముతుంది. ఈ నెల 22న రిలీజ్ అవబోతున్న సరైనోడు సినిమా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close