సీక్రెట్‌ పెళ్లితో షాక్ ఇచ్చిన ష‌క‌ల‌క

ఓ చిన్న‌పాటి సెల‌బ్రెటీ అనే పేరు తెచ్చుకొంటే చాలు.. ఆర్భాటంగా పెళ్లి చేసుకొంటారు. స్లార్ల‌ని పిలుచుకొని, మీడియాలో మంచి ప్ర‌మోష‌న్ వ‌చ్చేలాచూసుకొంటారు. కానీ.. అదేంటో క‌మెడియ‌న్ షకలక శంకర్ మాత్రం గ‌ప్‌చుప్‌గా అతి సాదాసీదాగా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. అవును.. ష‌క‌ల‌క శంక‌ర్ పెళ్ల‌యిపోయింది. శ్రీకాకుళం అరసవల్లిలోని కల్యాణ మండపంలో గ‌ప్ చుప్‌గాక్రవారం పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి కూతురు శంకర్ మేనమామ కూతురే. ఇంత స‌డ‌న్‌గా, అంత ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని అడిగితే… . తండ్రి మొక్కు వ‌ల్లే అరసవల్లిలో పెళ్లి చేసుకున్నానన్నాడు. హైద‌రాబాద్‌కి దూర‌మ‌నే ఉద్దేశంతోనే సహచర నటులెవరినీ ఆహ్వానించలేదన్నారు. హైద‌రాబాద్ వ‌చ్చాక మాత్రం రిసెప్ష‌న్ గ్రాండ్ లెవిల్లోఉంటుంది అంటున్నాడు ష‌క‌ల‌క శంక‌ర్‌. ఎనీవే… కొత్త పెళ్లి కొడుకు శంక‌ర్‌కి కంగ్రాట్స్ చెప్పేయండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close