“మీ కుటుంబసభ్యులు మాత్రమే గెలిచారు.. ఆ కిటుకేంటో అందరికీ చెప్పి ఉండవచ్చు కదన్నా” అని ఎన్నికల ఫలితాల తర్వాత ఓ సమావేశంలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి జగన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో వచ్చింది. జగన్ రెడ్డి జోకులు వేయరు. ఆయన మనస్థత్వం వేరు. వారు మాత్రం ఎలా గెలిచారు.. అన్న అనుమానం ఆయనను పట్టి పీడిస్తోంది. వారు టీడీపీతో కుమ్మక్కయి వైసీపీని నాశనం చేశారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఆయన అనుమానాలకు బలం చేకూర్చేలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్ పెద్దిరెడ్డి అనుచరుడు
తంబళ్లపల్లె నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేశాడు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు. కానీ గెలవాల్సిన సీటును పోగొట్టారని ఆ తర్వాత చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిజమే ఆయన పెద్దిరెడ్డి సోదరుడి కోసం ఓడిపోయారు. ఈ విషయం ఇప్పుడు స్పష్టతకు వస్తోంది. అయితే ఇదంతా పెద్దిరెడ్డి ఆడిన గేమ్ అని.. తంబళ్లపల్లె, పుంగనూరు, రాజంపేటఎంపీ స్థానాల్లో గెలవాడానికి మిగతా చిత్తూరు మొత్తం.. అలాగే తాను ఇంచార్జ్ గా చేసిన అనంతపురం జిల్లా మొత్తాన్ని పెద్దిరెడ్డి టీడీపీకి సరెండర్ చేశారన్నది అనుమానాలు జగన్ లో పెరుగుతున్నాయి.
పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని జగన్ అనుమానం
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డినే ప్రకటించారు. కానీ తర్వాత మార్చేశారు. భూమనకు ఇచ్చారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి పెద్దగా కనిపించడం లేదు. ఆయనపై చాలా కేసుల్లో విచారణలు సరిగ్గా జరగడం లేదు. అందర్నీ అరెస్టు చేస్తున్నా పెద్దిరెడ్డిని మాత్రం పట్టించుకోలేదు. ఈ అంశంపై టీడీపీలోనూ అనుమానాలు ఉన్నాయి. ఇక జగన్ రెడ్డికి రాకుండా ఉంటాయా?. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా జగన్ పట్టించుకోలేదు. రిలీజ్ అయినా పట్టించుకోలేదు. దానికి తోడు ఇప్పుడు ఆయనను కేంద్రం అమెరికా పంపుతోంది. ఇదంతా జగన్ లో మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి. పూర్తిగా ఆ కుటుంబాన్ని దూరం పెట్టాడానికి కారణం అవుతున్నాయి.
జగన్ అనుమానం పెనుభూతం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ మిస్ అయినప్పుడు ఆ హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన .. ఆయన వ్యక్తిగత సహాయకుడు సూరీడు వెళ్లలేదు. దీంతో జగన్ ఆయనపై అనుమానం పెంచుకున్నారు. ఎందుకువెళ్లలేదు.. ఆ కుట్రలో ఆయన కూడా భాగస్వామి అని నమ్మి ఆయనను రోడ్డుపై పడేశారు. హెలికాఫ్టర్ లో ప్లేస్ లేక వెళ్లలేదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ జగన్అలా అనుకోరు. ఇప్పుడు పెద్దిరెడ్డి విషయంలోనూ అలాగే అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు, అనంతపురం కాదు.. మొత్తం రాష్ట్రంలోనే వైసీపీ కొట్టుకుపోయిందని ఆయన గుర్తించడం లేదు. కేవలం పెద్దిరెడ్డి ఫ్యామిలీస్ ఎలా గెలిచిందనేది ఆయన డౌట్.ఆ అనుమానానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ బలి కావాల్సిందే.