అల వైకుంఠపురములో, అఖండ, అఖండ 2 లాంటి చిత్రాలకు పని చేసిన రచయిత త్రిపురనేని కల్యాణ చక్రవర్తి. ఈయన రాసిన కొన్ని పాటలు బాగా పాపులర్ అయ్యాయి. పొలిటికల్ పార్టీలకు సైతం గీతాలు అందించారు. పాటలు – మాటలు, స్క్రిప్టు వర్క్ ఇలా రచనా వ్యాసాంగానికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ మునిగితేలిన వ్యక్తి. ఇప్పుడు మెగాఫోన్ పడుతున్నారు. ఓ యువ హీరో కోసం ఓ కథ సిద్ధం చేశారు. మార్చి తొలి వారం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి కల్యాణ్ రామ్ తో కల్యాణ చక్రవర్తి ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాజెక్ట్ ఎంత వరకూ వచ్చిందో తెలీదు కానీ, అంతకంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కెతుంది. హీరోగా యంగ్ స్టర్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తెరంగేట్రం చేయబోతున్నాని సమాచారం. హీరో కొత్తవాడైనా సెటప్ మాత్రం పెద్దదే అని, నటీనటులు, సాంకేతిక నిపుణులగా పేరున్న వాళ్లని ఎంచుకొంటారని తెలుస్తోంది. ఈనెలాఖరున ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
