11న వస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐస్’

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై మీరాజాస్మిన్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని‘ది ఐస్’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అదే పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రానికి షాజియం దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతుంది. ఈ సందర్భంగా….

చిత్ర నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ‘’పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ పెళ్లికి ముందు నటించిన మలయాళ చిత్రమిది. అంధురాలిగా ఉన్న యువతికి కంటిచూపు వస్తుంది. కానీ ఆమెకి అప్పటి నుండి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. అవేంటో సినిమాలో చూడాల్సిందే. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది. నేను మలయాళంలో ఈ చిత్రాన్ని చూడగానే నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనిపించింది, అందుకే ఈ చిత్ర రైట్స్ ను కొని తెలుగులో ది ఐస్ పేరుతో విడుదల చేస్తున్నాను. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క సహాయంతో రీరికార్డింగ్ ను కొత్తగా చేయించాను. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేస్తున్నాం. షాజియం ఒక మంచి పాయింట్ తో ఇంతకు ముందు చెప్పిన విధంగా హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కించారు. మీరా జాస్మిన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే మా బ్యానర్ లో వంశీగారి దర్శకత్వంలో రూపొందిన ‘వెన్నల్లో హాయ్ హాయ్’చిత్రాన్ని కూడా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close