కీర‌వాణి కొంచెం త‌గ్గాడండోయ్‌

ఆమ‌ధ్య ట్విట్ట‌ర్‌లో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, గీత ర‌చ‌యిత‌ల‌పై సెటైర్లు వేశారు కీర‌వాణి. గీత ర‌చ‌యిత‌లు నొచ్చుకొనే మాట‌లెన్నో మాట్లాడారు. వేటూరి మ‌ర‌ణం, సిరివెన్నెల అనారోగ్యంతో తెలుగు సినిమా పాట ప‌డకెక్కింద‌ని ఘాటైన వ్యాఖ్య‌లే చేశారు. దాంతో చాలామంది గీత ర‌చ‌యిత‌లు బాహాటంగానే త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే.. ఇప్పుడు కీర‌వాణి ‘స్వ‌రం’ మారింది. ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను గీత ర‌చ‌యిత‌ల ప‌క్ష‌పాతి అన్న‌ట్టు మాట్లాడారు. గీత ర‌చ‌యిత‌ల‌కు ప్ర‌తిభ ఉంద‌ని, అయితే.. దాన్ని వాడుకోవ‌డం లేద‌ని, వాళ్ల‌కు స‌రైన పారితోషికాలు ఇవ్వ‌డం లేద‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా కంటే ఓ ర‌చ‌యిత‌గా తానెక్కువ‌గా గ‌ర్వ‌ప‌డుతుంటాన‌ని వ్యాఖ్యానించారు కీర‌వాణి.

అయితే… ఈనాటి గీత ర‌చయిత‌ల్లో ప్ర‌శ్నించే ధోర‌ణి లేద‌ని చుర‌క‌లు అంటించారు. వేటూరి, సిరివెన్నెల అయితే.. ‘ఇదేం క‌థ‌’ అంటూ క‌థ న‌చ్చ‌క‌పోతే తిట్టిన సంద‌ర్భాలున్నాయ‌ని, కానీ ఇప్ప‌టి వాళ్లు స‌ర్దుకుపోతున్నార‌ని, ఆ బాధ‌తోనే తాను ట్విట్ట‌ర్‌లో అలా వ్యాఖ్యానించాల్సివ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు కీర‌వాణి. వ్య‌వ‌హారం చూస్తుంటే కీర‌వాణి కాస్త మొత్త‌బ‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. దానికి కార‌ణ‌మేంటో ఆయ‌న‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close