బి.గోపాల్‌కు బాల‌య్య పిలుపు

బాల‌య్యంతే. ఎప్పుడు ఎవ‌రికి ఎలా అవ‌కాశాలిస్తాడో చెప్ప‌లేం. హిట్లు లేని పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా చేయ‌డానికి సై అన్నాడు. పైసా వ‌సూల్ వ‌చ్చింది. ఇప్పుడు బి.గోపాల్‌కి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. తెలుగు చిత్ర‌సీమ‌లో బాల‌య్య – బి.గోపాల్‌ల‌ది తిరుగులేని కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి నుంచి ఎన్నో హిట్లు, సూప‌ర్ హిట్లు వచ్చాయి. తెలుగునాట ఓ ట్రెండ్ సృష్టించిన స‌మ‌ర‌సింహారెడ్డి… వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సినిమానే. కొంత‌కాలంగా బి.గోపాల్ సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఈమ‌ధ్య కాలంలో చేసిన ఒకే ఒక్క సినిమా – ఆర‌డుగుల బుల్లెట్ విడుద‌ల‌కు నోచుకోలేదు. అయినా స‌రే… బి.గోపాల్ కి బాల‌య్య నుంచి పిలుపు వెళ్లింద‌ట‌. ‘మ‌నం ఓ సినిమా చేస్తున్నాం.. క‌థ రెడీ చేసుకో’ అని బాల‌య్య సంకేతాలు అందించిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య‌కోసం త‌గిన క‌థ త‌యారు చేసే ప‌నిలో ఉన్నార్ట గోపాల్‌. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close