ఆది జైలుకి వెళ్లాల్సిందే

ఒక‌ప్పుడు ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌తీసి, మాస్ ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నారు ర‌విరాజా పినిశెట్టి. ఆయ‌న త‌న‌యుడు ఆది పినిశెట్టి హీరోగా బిజీగానే ఉన్నాడు. వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాల‌తో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు స‌రైనోడులో విల‌న్ పాత్ర పోషించి భేష్ అనిపించుకొన్నాడు. అన్న‌ట్టు త్వ‌ర‌లోనే ఆది పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. ఈవిష‌యాన్ని తానే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

”ఇంట్లో పెళ్లి చేసుకోమ‌ని గొడ‌వ చేస్తున్నారు. అంటే త్వ‌ర‌లోనే జీవిత ఖైదు విధించ‌బోతున్నార‌న్న‌మాట‌. నేను త‌ప్ప‌కుండా జైలు కెళ్లాల్సిందే” అంటూ త‌న పెళ్లిపై తానే జోకు వేసుకొన్నాడు ఈ యువ న‌టుడు. ”ఎవ్వ‌రినైనా ప్రేమిస్తే.. పెళ్లి చేస్తాం అని ఇంట్లోవాళ్లు చెప్పేశారు. అయితే అలాంటి గొడ‌వ‌లేం లేవు. ఇంట్లో చూసిన సంబంధాన్నే చేసుకొంటా. నా పెళ్లి బాధ్య‌త మొత్తం ఇంట్లోవాళ్ల‌దే” అంటున్నాడు ఆది పినిశెట్టి. ‘స‌రైనోడు’ సినిమాలో త‌న పాత్ర‌కు వ‌చ్చిన రెస్పాన్స్ సూప‌ర్బ్‌గా ఉంద‌ని మున్ముందూ ప్ర‌తినాయ‌కుడిగా మంచి అవ‌కాశాలొస్తే న‌టిస్తాన‌ని అంటున్నాడు ఆది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close