ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకును ఈ సారి బీజేపీకి పూర్తి స్థాయి సలహాలు, సూచనలుగా మార్చారు. తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపడటం లేదు అని ఎంపీలతో ప్రధాని మోదీ చేసిన ప్రస్తావనను లీడ్‌గా తీసుకుని తన సలహాల పరంపర ఇచ్చారు. ఈ కథనం అంతా బీజేపీకి సలహాలే. ఆయన ఇచ్చిన కీలకమైన సలహాల్లో ముఖ్యమైనవి కొన్నాయి. వాటిలో కొన్ని..
బీఆర్ఎస్ను బలహీనం చేయాలి!
భారత రాష్ట్ర సమితి బలహీనపడితేనే బీజేపీ బలపడుతుంది. ఇది సహజంగా వస్తున్న విశ్లేషణ. ఆర్కే కూడా ఇదే చెప్పారు. అందుకే భారత రాష్ట్ర సమితిని వీలైనంతగా బలహీన పరిచే ప్రయత్నం చేయాలన్నారు. కానీ బీజేపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని .. వారి రాజకీయాలను విమర్శించారు. ఒక్క రు కూడా సీరియస్ గా రాజకీయాలు చేయడం లేదని..దానికి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఫలితమే సాక్ష్యమన్నారు.
కవితను ఆయుధంగా వాడుకోవాలి !
బీఆర్ఎస్ ను బలహీనం చేయడానికి కావాల్సినన్ని ఆయుధాలు బీజేపీ ముందు ఉన్నాయి. అందులో ప్రధానమైనది కవిత. ఆమె కుటుంబం నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బీఆర్ఎస్ జరిగిన స్కాములన్నీ బయటపెడుతున్నారు. వాటిని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది కానీ.. బీజేపీ మాత్రం సైలెంటుగా గా ఉంటోంది. కవిత మామూలు నాయకురాలు కాదు.. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించారు. ఆమె అన్నీ బయట పెడుతూంటే ఎందుకు సైలెంటుగా గా ఉంటున్నారన్నది ఆర్కే ప్రశ్న.
బలమైన బీసీ నాయకుడికి నాయకత్వం ఇవ్వాలి !
పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఆయన సలహా ఇవ్వలేదు కానీ.. బలమైన బీసీ నాయకుడని తెరపైకి తీసుకు వచ్చి పార్టీని నడిపించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం ఆయన గట్టిగానే చెప్పారు. ప్రస్తుత నాయకత్వం ధోరణితో అది సాధ్యం కాదని అంటున్నారు. పనిలో పనిగా బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశంసించారు.ఆయన హయాంలో పోటాపోటీగా వచ్చిందన్నారు. అంటే ఇప్పుడు కూడా ఆయనకే చాన్స్ ఇచ్చి ప్రయత్నించాలంటున్నారు.
ఉత్తరాది మోడల్ పని చేయదు!
తెలంగాణ కేంద్ర నాయకత్వం ఉత్తరది మోడల్ తో తెలంగాణలో బలపడేలా ప్రయత్నం చేస్తోందని కానీ ఇక్కడ అది పని చేయదని.. ఆర్కే.. మోదీ, షాలకు తన ఆర్టికల్ ద్వారా సూచించారు. తెలంగాణలో ఉత్తరాది రాజకీయాలు నడవవని…. తాను చెప్పిన సలహాలు పాటించి.. బీఆర్ఎస్ అంతం చేసి తలపడితేనే వచ్చే ఎన్నికల్లో.. రేవంత్ వర్సెస్.. బీజేపీనా.. బీఆర్ఎస్నా అన్నది క్లారిటీ వస్తుందని తేల్చేశారు. మరి ఆర్కే సలహాలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి నచ్చుతాయా?
