విశ్వక్సేన్ పాగల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు నరేష్. ఆ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ తో గోట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చాడు. నిర్మాతే డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట ప్రోమో వదిలారు. దీనికి సెటైర్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు నరేష్. ‘ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది. ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క పాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకొని.. అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడాడు.
ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసింది గోట్ హీరోయిన్ దివ్యభారతి. దర్శకుడు నరేష్ పైన కొన్ని ఆరోపణలు చేసింది. ‘మహిళలను “చిలక” అని లేదా ఏ పేరుతోనైనా పిలవడం సరదా కాదు. అది మహిళల్ని తక్కువగా చూసే మనస్తత్వం. ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. అదే దర్శకుడు సెట్ట్లో కూడా ఇలానే మహిళలను అవమానించేలా ప్రవర్తించాడు. తాను చేస్తున్న కళకే గౌరవం లేకుండా చేశాడు. నన్నెంతగానో బాధపెట్టింది ఏమిటంటే… హీరో ఇవన్నీ చూసినా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది అలాంటి సంస్కృతికి ఇంకో రోజు ఆయువు పొసినట్టే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాగల్ సినిమా మంచి హైప్ తో వచ్చింది. ఇండస్ట్రీలో మంచి ప్రచారం దక్కింది. కానీ ఫలితం తేడా కొట్టింది. దీంతో డైరెక్టర్ నరేష్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడింది. సుధీర్ తో సినిమా చేసి నిరూపించుకోవాలని చూశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సివచ్చింది. ఇప్పుడీ వివాదంలో మళ్ళీ తెరపైకి వచ్చాడు. తన చేసిన ఆరోపణలపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.

