అడవిశేష్ కథల ఎంపిక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనకు కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టమన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. కథ నచ్చితే మాత్రం ఆ దర్శకుడి ట్రాక్ రికార్డ్ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు కూడా అలానే ఓ కథకు అడవిశేష్ ఓకే చెప్పినట్టు టాక్.
‘చిలసౌ’తో ఆకట్టుకొన్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆతరవాత ‘మన్మథుడు 2’ మిస్ ఫైర్ అయ్యింది. అయితే ‘గాళ్ ఫ్రెండ్’తో విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ఇప్పుడు ఆయన రెండు కథల్ని రెడీ చేసుకొన్నారు. ఓ కథ దీక్షిత్ శెట్టికి చెప్పారు. ‘గాళ్ ఫ్రెండ్’ సినిమాలో దీక్షిత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ దీక్షిత్ తోనే పని చేయబోతున్నారు. దాంతోపాటుగా అడవిశేష్కి కూడా ఓ కథ చెప్పారని తెలుస్తోంది. ఈ కథ శేష్‌కి బాగా నచ్చిందని సమాచారం. అయితే శేష్ ప్రస్తుతం బిజీ. ఆయన డేట్లు దొరకాలంటే కొంతకాలం ఎదురు చూడాలి. ఈలోగా రాహుల్ రవీంద్రన్ దీక్షిత్ తో సినిమా పూర్తి చేస్తారు. ఈ చిత్రానికి ధీరజ్ మొగలినేని నిర్మాతగా వ్యవహరిస్తారు. `గాళ్ ఫ్రెండ్` చిత్రానికీ ఆయనే ప్రొడ్యూసర్. ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తాయి.


