కుబేర, కూలీలలో భిన్నమైన పాత్రలు పోషించారు కింగ్ నాగార్జున. కుబేర నాగ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. కూలీలో స్టైలీష్ విలన్ గా కనిపించారు. ఈ సినిమాలో నాగ్ పోషించిన సైమన్ పాత్రకు విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చింది. కానీ అనుకొన్నంత స్థాయిలో ఈ పాత్ర పేలలేదు. నాగ్ లాంటి హీరో విలన్ గా టర్న్ అయితే ఎలా వుండాలి? కానీ అంత పవర్ సైమన్ పాత్రలో కనిపించలేదు. కుబేర కంటే కూలీపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకొన్న నాగ్ .. ఈ విషయంలో కాస్త అసంతృప్తికి గురవ్వడం సహజం.
నాగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడన్నది ప్రశ్న. ఈనెల 29న నాగార్జున పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రాబోతోంది. కాన్సెప్ట్ టీజర్ ఒకటి రెడీ అయ్యిందని, నాగ్ పుట్టిన రోజున అది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రా.కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడిగా పని చేస్తున్నాడు. నాగ్ నటించే 100వ సినిమా ఇది. కాబట్టి… స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమై 50 ఏళ్లయ్యింది. అందుకే మరింత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.