గీత గోవిందం… శిరీష్ హ‌ర్ట‌య్యాడు

విడుద‌లై రెండు వారాలు కావొస్తున్నా… గీత గోవిందం టాపిక్ ఇంకా న‌డుస్తూనే ఉంది. ఈ సినిమా గురించి ఇంకా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా ‘గీత గోవిందం’ని అభివ‌ర్ఱిస్తున్నారు విశ్లేష‌కులు. ఈ సినిమా అంద‌రిలోనూ ఆనందాన్నీ, సంతోషాన్నీ మిగిల్చింది. అయితే అల్లు శిరీష్ మాత్రం ఈ సినిమా గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా ఏదో వెలితిగా భావిస్తున్నాడ‌ట‌. దానికి కార‌ణం.. `గీత గోవిందం` స్క్రిప్టు త‌ను చేయాల‌నుకున్నాడ‌ట‌. ‘శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు’ త‌ర‌వాత గీతా ఆర్ట్స్ లో మ‌రో సినిమా చేయ‌డానికి అడ్వాన్స్ తీసుకున్నాడు ప‌ర‌శురామ్‌. ఆ స‌మ‌యంలోనే ‘గీత గోవిందం’ స్క్రిప్టు పుట్టింది. క‌థా చర్చ‌ల్లో భాగంగా ‘ఈ సినిమా నేను చేస్తా’ అని శిరీష్ ముందుకొచ్చాడ‌ట‌. ఈ క‌థ‌పై న‌మ్మ‌కంతో బ‌న్నీ వాసు, అర‌వింద్ కూడా ‘దీన్ని శిరీష్‌తో చేసేద్దాం’ అన్నార్ట‌. కానీ… ప‌ర‌శురామ్ మాత్రం ‘నాకు మ‌రో హీరో కావాలి..’ అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. ‘కామెడీ టైమింగ్ బాగా తెలిసున్న క‌థానాయ‌కుడు కావాలి.. అప్పుడే ఈ క‌థ వ‌ర్క‌వుట్ అవుతుంది’ అని ప‌ట్టుప‌ట్టి కూర్చున్నాడ‌ట‌. శిరీష్‌, అల్లు అర‌వింద్ ఎన్నిసార్లు అడిగినా ప‌ర‌శురామ్ ఇదే మాట చెప్ప‌డంతో.. అప్పుడు ఈ క‌థ విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. శిరీష్ చేస్తే ఈ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ హైప్‌, ఈ స్థాయి ఓపెనింగ్స్ కూడా వ‌చ్చేవి కావు. విజ‌య్ దేవ‌ర‌కొండ చేయ‌డం కూడా గీతా ఆర్ట్స్‌కి మంచిదే అయ్యింది. వార‌సుడికి ఓ విజ‌యం చేజారి ఉండొచ్చు.. కానీ సంస్థ‌కు ఈ స్థాయిలో లాభాలు మాత్రం వ‌చ్చి ఉండేవి కావు. అలా.. ప‌ర‌శురామ్ నిర్ణ‌యంతో గీతా ఆర్ట్స్‌కి లాభ‌మే జ‌రిగింది త‌ప్ప‌.. న‌ష్టం జ‌ర‌గ‌లేదు. కాక‌పోతే… ఈ సినిమా గురించి మాట్లాడుతున్న‌ప్పుడల్లా.. ‘అరె.. నేను చేసుండాల్సిందే..’ అంటూ శిరీష్ కాస్త చిన్న‌బోతున్నాడ‌ట‌. అంతే తేడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close