సమయానికి జీతాలు ఇవ్వలేకపోయిన ఏపీ సర్కార్

27 శాతం పెరిగిన ఐఆర్‌తో… ఈ సారి జీతం దండిగా వస్తుందని… 31వ తారీఖు కోసం ఆశగా ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు…. ఒకటో తేదీ దాటి.. రెండో తేదీ వచ్చినా జీతం కళ్లజూడలేకపోయారు. సాధారణంగా.. నెలాఖరు రోజు… జీతాలు అకౌంట్లలో జమ అవుతాయి. ఏదైనా సమస్య వస్తే.. ఒకటో తేదీ ఉదయమే.. శాలరీ క్రెడిట్ అయిన మెసెజ్.. ఫోన్‌లో చూసుకుంటారు. కానీ.. ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు.. ఆ ఎదురు చూపులు.. ఎక్కువైపోతున్నాయి. జీతం అందక.. ఏం జరిగిందోనన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏపీ సెక్రటేరియట్‌లోనే కాదు.. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ.. ఇప్పుడు జీతాల టాపిక్ వినిపిస్తోంది.

జీతాలు ఆలస్యం అయితే.. ఉద్యోగుల్లో జరిగే చర్చ ఒకటే. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవా..? నిధులు నిండుకున్నాయా..? అన్నదే. ఎందుకంటే.. సర్కార్ తీసుకుంటున్న చర్యలు.. పెడుతున్న ఖర్చులు.. ఆదాయాలపై ఏ మాత్రం అంచనా లేకుండా.. ముందస్తు ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ క్రమంలో జీతాల బిల్లు కోసం.. సరైన విధంగా ఏర్పాట్లు చేయలేకపోయారనే చర్చ నడుస్తోంది. రోజువారీగా వచ్చే ఆదాయంతో… రెండు, మూడురోజులు ఆలస్యం చేసి.. అలా వచ్చిన నిధులతో.. జీతాలు చెల్లించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ప్రారంభమయింది. అయితే… ప్రభుత్వ వర్గాలు మాత్రం.. ఆర్బీఐ దగ్గర ప్రాసెస్‌లో సమస్య వచ్చిందని.. అది ఒకటి, రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని అంటున్నారు.

నిజానికి ఉద్యోగుల జీతాలే కాదు.. సామాజిక పెన్షన్లు కూడా.. ఈ సారి కూడా ఆలస్యమయ్యాయి. గత నెలలో.. వైఎస్ఆర్ జయంతి రోజున ఇస్తామంటూ.. ఆపేసి.. ఎనిమిదో తేదీన పంపిణీ చేశారు. ఈ సారి ఒకటో తేదీనే పంపిణీ చేయాల్సి ఉంది. అయితే.. అన్ని చోట్లకు.. సగానికి సగం మాత్రమే పంపారు. నాలుగైదు రోజుల్లో మిగతా మొత్తం వస్తుందని ఉన్నతాధికారులు.. సమాచారం ఇచ్చినట్లు.. పంచాయతీ అధికారులు .. పెన్షన్ల కోసం వచ్చిన వారికి సర్ది చెబుతున్నారు. నిజంగా.. ఆర్బీఐ సమస్య అయితే.. పెన్షన్లకు ఎందుకు కట కట వస్తుందన్నది అంతుబట్టని విషయంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close