రుషికొండ తవ్వకాల కోసం సుప్రీంకోర్టుకెళ్లిన ఏపీ సర్కార్ !

రుషికొండను ఎలాగైనా మాయం చేయాలని కంకణం కట్టుకున్నారేమో కానీ.. తవ్వకాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే పై ఏపీ సర్కార్ నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే అసలు ఫిర్యాదే.. పర్యావరణ అనుమతులు తీసుకుని అంతకు మించి ఎక్కువగా తవ్వేస్తున్నారనేది. అందుకే.. ఎంత వరకూ పర్మిషన్ తీసుకున్నారు.. ఎంత వరకూ తవ్వారు లాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఎన్జీటీ కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తే… అనుమతులను ఉల్లంఘించారో లేదో స్పష్టమవుతుంది. అసలు కమిటీ విచారణ జరపకుండానే తాము అనుమతులు తీసుకున్నామంటూ వితండ వాదన చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం న్యాయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. సుప్రీంకోర్టు ఇలాంటి విషయాల్లో ఎన్జీటీలోనే తేల్చుకోవాలని అంతిమ నిర్ణయం తర్వాత తమ వద్దకు రావాలని చెబుతూ ఉంటుంది. పలు మార్లు ఇతర అంశాల్లో ఇదే జరిగింది.

ఇవన్నీ ఏపీ ప్రభుత్వ లాయర్లకు తెలియనిదేం కాదు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న కారణం చూపి.. తవ్వకాలు కొనసాగించేందుకే ఇలా చేశారన్న అనుమానాలు కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి. రుషికొండను ఇప్పటికే చుట్టూ తవ్వేశారు. ఇంకా తవ్వుతున్నారు. మొత్తం తవ్వాలనుకుంటున్నారోలేదో.. కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close