అఖిల ప్రియ వివాహం: వైభవంగా నే, కానీ ..

AP Minister Akhila Priya ties the knot with Bhargav Ram Naidu
AP Minister Akhila Priya ties the knot with Bhargav Ram Naidu

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం నిన్న జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభా నాగి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈ వివాహ వేడుక వైభవంగా జరిగింది. అయితే అనుకోని పరిణామాల వల్ల పెళ్లి వేడుక కళ తప్పినట్లు అనిపించింది.

దురదృష్టవశాత్తు, నందమూరి హరికృష్ణ అదే రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా, మంత్రులు, తెలుగుదేశం నేతలు, అందరూ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి సహా చాలా మంది మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు ఆ వివాహానికి హాజరు కావలసి ఉంది. కానీ అనుకోని పరిణామాల రీత్యా ఎవరూ హాజరు కాలేకపోయారు. దీంతో వివాహం వైభవంగా నే జరిగినప్పటికీ కళ తప్పినట్లు అనిపించింది. ఆ దుర్ఘటన గనక జరగకపోయి ఉంటే, రాజకీయ నాయకుల సందడితో, మీడియా సందడితో, వివాహం మరింత సందడిగా ఉండేది అనడంలో సందేహం లేదు.

ఇక భూమా నాగిరెడ్డి, శోభ ల మొదటి కుమార్తె అయిన అఖిలప్రియ, ప్రముఖ వ్యాపారవేత్త అయిన భార్గవ రామ్ నాయుడు ని పెళ్లాడారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com