బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. వాస్తవాలను విస్మరించి, భావోద్వేగాలతో కొందరు ఉద్యమకారులు భారత్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారు. కానీ ఆర్థిక కోణంలో చూస్తే బంగ్లాదేశ్ మనుగడకు భారతే కీలకం . భారత్ కన్నెర్ర చేస్తే ఆ దేశం ఆకలితో అలమటిస్తుంది. కరెంట్, డీజిల్ నుంచి వారి క్రికెట్ స్పాన్సర్ల వరకూ భారత్ తో ముడిపడి ఉన్నాయి. తేడా వస్తే వారి జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయి.
రాజకీయ కుట్రల కోసం భారత్ పై నిందలు
బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య భారత్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆ దేశ ప్రయోజనాలకే గొడ్డలి పెట్టుగా మారుతోంది. కొంతమంది ఉద్యమకారులు, రాజకీయ శక్తులు భారత్ తమపై ఆధారపడుతోందని, భారత్ వల్లనే తమకు నష్టం జరుగుతోందని ప్రచారం చేస్తూ అందర్నీ రెచ్చగొడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రజల దైనందిన జీవితంలో అవసరమయ్యే నిత్యావసరాల నుండి ఇంధనం వరకు ప్రతి విషయంలోనూ భారత్ ఒక లైఫ్ లైన్ గా నిలుస్తోంది.
నిత్యావసరాల కోసం భారత్ వైపే..
బంగ్లాదేశ్ మార్కెట్లలో లభించే ఉప్పు, పప్పులు, ఉల్లిపాయలు, పండ్లు , ఇతర నిత్యావసర వస్తువులలో సింహభాగం భారత్ నుండే ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా తగ్గినప్పుడు భారత్ నుండి వచ్చే దిగుమతులే ఆ దేశ సామాన్యుడి ఆకలి తీరుస్తున్నాయి. ఒకవేళ భారత్ తన ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే, బంగ్లాదేశ్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడమే కాకుండా, కనీస ఆహార భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
విద్యుత్, ఇంధన రంగాల్లో పెనవేసుకున్న బంధం
కేవలం ఆహారమే కాదు, బంగ్లాదేశ్ వెలుగులు కూడా భారత్‌తో ముడిపడి ఉన్నాయి. భారత్ నుండి సుమారు 1,160 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. అలాగే, అదానీ పవర్ వంటి సంస్థల ద్వారా అందుతున్న విద్యుత్ ఆ దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉంది. దీనికి తోడు, ఇండో-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్‌లైన్ ద్వారా డీజిల్ సరఫరా జరుగుతోంది. భారత్ గనుక ఈ సరఫరాను నిలిపివేస్తే, బంగ్లాదేశ్‌లో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడమే కాకుండా, గంటల తరబడి పవర్ కట్లతో దేశం అంధకారంలో మునిగిపోతుంది.
ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం
బంగ్లాదేశ్ తన వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినా, దానికి కావాల్సిన ముడి సరుకులు, పత్తి , యంత్రాల కోసం భారత్‌పైనే ఎక్కువ ఆధారపడుతుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్ ఎగుమతులు ఆపేస్తే, బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. చదువులేని , స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఉద్యమకారులు భారత్ తమపై ఆధారపడుతోందని చేస్తున్న ప్రచారం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. బంగ్లాదేశ్ విముక్తిలో కీలక పాత్ర పోషించిన నాటి నుండి నేటి ఆర్థిక సహాయం వరకు భారత్ పెద్దన్న పాత్రనే పోషిస్తోంది. ఇప్పుడు భారత్ నే నిందిస్తున్నారు అక్కడి మతం పిచ్చి పట్టిన ఉన్మాదులు. వారికి బుద్ది చెప్పాల్సిన సమయం దగ్గర పడుతోందని అనుకోవచ్చు.
