జగన్ రెడ్డి గురించి తెలుసు. ఆయన క్షుద్ర రాజకీయం గురించీ తెలుసు. ఓడిపోయినప్పటి నుండి ఆయన వారానికి రెండు రోజులు మాత్రమే ఏపీలో ఉండి ఐదు రోజులు బెంగళూరులో ఉంటూ అక్కడ బ్యాక్ ఆఫీసు నడుపుతున్నారని తెలుసు. ఎందుకు నడుపుతున్నారో కూడా ఓ సారి యనమల బయట పెట్టారు. జగన్ రెడ్డి రాజకీయం అంతా కుట్రలు , కుతంత్రాలు.. విధ్వంసాలు, కుల చిచ్చులతోనే ఉంటుంది. అంతా తెలిసి కూడా.. ఇప్పుడు ఇలాంటి పరిణామాలు జరిగే చాన్స్ ఇవ్వకూడదు. ఇప్పటికైనా అసలు కుట్రల కేంద్రంపైనే దృష్టి పెట్టాల్సి ఉంది.
బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా కుల చిచ్చుకు కుట్రలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారం కోల్పోయినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రజాక్షేత్రంలో పోరాడటం కంటే, తన సొంత ఇలాకా అయిన ఏపీలో కంటే.. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతుండటం వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వారానికి రెండు రోజులు మాత్రమే ఏపీలో ఉంటూ, మిగిలిన ఐదు రోజులు బెంగళూరు బ్యాక్ ఆఫీస్ నుండి చక్రం తిప్పడం అనేది కేవలం విశ్రాంతి కోసం కాదని, రాష్ట్రంలో అశాంతిని రాజేసే ఒక వ్యవస్థీకృత వ్యూహమని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.
బూతులే ఆయుధం – తిరగబడితే కుల ఉన్మాదం
యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలు ఇటీవల బయటపెట్టినట్లుగా, ఈ బెంగళూరు ప్యాలెస్ కేవలం ఒక నివాసం కాదు అది కుట్రలు, కుతంత్రాలకు అడ్డాగా మారింది. అధికారం చేజారిన నాటి నుండి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మానేసి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యర్థులపై బూతులతో దాడి చేయించడం, తద్వారా వ్యవస్థలను బలహీనపరచడం వంటి పనులకు అక్కడే ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడమే కాకుండా, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే జగన్ మార్కు క్షుద్ర రాజకీయం అక్కడి నుండే కార్యరూపం దాల్చుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
రాష్ట్రంపై కుట్రలను కూకటి వేళ్లతో పెకిలించాల్సిందే!
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యవస్థీకృత దాడులు, వ్యక్తిత్వ హననం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో చెప్పాల్సిన పని లేదు. తెరపై కనిపించే చిన్న చిన్న పావుల ను పట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అసలు ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నది ఎవరు? వారికి అందుతున్న ఆదేశాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. కుల సమీకరణలను దెబ్బతీసి, సమాజంలో విద్వేషాలను రగిలించే ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు వ్యక్తిని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏపీలో అస్థిరతను సృష్టించడానికి బెంగళూరులో తయారవుతున్న ఉద్దేశపూర్వంగా చేస్తున్న బూతుల దాడి.. దాని వెనుక ఉన్న కుల చిచ్చును గుర్తించి.. మొదట్లోనే తుంచి వేయాలి.


