బిగ్ బాస్ 3 : నాగ్ Vs విజ‌య్ దేవ‌కొండ‌.. ఎవ‌రు బెట‌ర్‌?

జులైలో బిగ్ బాస్ 3 సీజ‌న్ మొద‌లుకాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సీజ‌న్‌కి హోస్ట్ ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. నిర్వాహ‌కులు ఓ హోస్ట్‌ని తీసుకురావ‌డానికి కిందా మీదా ప‌డుతున్నారు. రాజ‌మౌళి సినిమాలో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఎన్టీఆర్ బిగ్ బాస్‌పై ఏమాత్రం దృష్టి పెట్ట‌లేక‌పోతున్నాడు. ఇక నాని.. మ‌ళ్లీ ఈ బిగ్ బాస్ హోస్‌లో అడుగుపెట్టేందుకు ధైర్యం చేయ‌డం లేదు. బ‌న్నీ, రానా… ఇలా చాలార‌కాల పేర్లు వినిపించాయి. నాగార్జున ఆల్మోస్ట్ ఫిక్స‌యిపోయాడ‌ని టాక్ వినిపించింది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరిద్ద‌రిలో ఎవ‌రు బెట‌ర్ అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

నాగార్జున‌కు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పోగ్రాంని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన అనుభ‌వం ఉంది. అమితాబ్ బ‌చ్చ‌న్ స్ఫూర్తితో అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పోగ్రాంని తీసుకొచ్చారు. అయితే.. ఒక్క నాగార్జున మాత్ర‌మే ఈ షోని స‌క్సెస్‌ఫుల్‌గా న‌డ‌ప‌గ‌లిగాడు. విజయ్ దేవ‌ర‌కొండ‌తో పోలిస్తే.. నాగార్జున అనుభ‌వం అపారం. త‌న స్టార్ స్టేట‌స్ వేరు. కుటుంబ ప్రేక్ష‌కుల దృష్టిని త‌న‌వైపుకు మ‌ర‌ల్చ‌గ‌ల‌డు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ సునామీ. రెండు సినిమాల‌తో స్టారైపోయాడు. ఇప్పుడు యూత్ లో త‌న పేరే మార్మోగిపోతోంది. విజ‌య్ పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. త‌న వాక్ చాతుర్యం ఇది వ‌ర‌కు కొన్ని వేదిక‌ల‌పై చూశాం. ముక్కుసూటిగా పోయే మ‌న‌స్త‌త్వం ఈ షోకి బాగా క‌లిసొస్తుంది. యూత్‌లో విజ‌య్‌కి ఉన్న ఇమేజ్ త‌న‌కి ప్ల‌స్ పాయింట్‌. అమ్మాయిల‌లో మ‌రింత క్రేజ్ ఉంది. పైగా అంద‌రితోనూ క‌లిసిపోయే ల‌క్ష‌ణం కూడా ఉంది. ఇదంతా దృష్టిలో ఉంచుకుంటే నాగార్జున కంటే విజ‌య్‌నే బెట‌ర్ ఆప్షన్ అనిపిస్తుంది. అయితే విజ‌య్ కి చాలా క‌మిట్మెంట్స్ ఉన్నాయి. డియ‌ర్ కామ్రేడ్ త‌ర‌వాత తాను ఒప్పుకున్న సినిమాల లిస్టు చాంతాడంత ఉంది. వాట‌న్నింటి మ‌ధ్య బ్రాండింగ్‌లు ఒక‌టి. ఇవ‌న్నీ స‌ర్దుబాటు చేసుకుంటూ.. వారానికి ఒక‌రోజు ‘బిగ్ బాస్‌’కి కేటాయించ‌గ‌డా? అనేదే అనుమానం. విజ‌య్‌ని గ‌నుక యాజ‌మాన్యం ఒప్పించ‌గ‌లిగితే ఈసారి కూడా షో ర‌క్తిక‌ట్టే అవ‌కాశం ఉంది. కాద‌న్న ప‌క్షంలో నాగ్ ఎలాగూ ఉండ‌నే ఉన్నాడు.

కాక‌పోతే `మ‌న్మ‌థుడు 2` షూటింగ్ దాదాపుగా విదేశాల్లో జ‌ర‌గ‌బోతోంది. బిగ్ బాస్ గ‌నుక ఒప్పుకుంటే… ఆ షెడ్యూల్స్‌లో మార్పు ఉండొచ్చు. లేదంటే జులైలో బిగ్ బాస్ సీజ‌న్ మొద‌లుకాబోతోంది. ఈలోగా ‘మన్మ‌థుడు’ పూర్తి చేయాల్సివ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com