నోటా లేక టీఆర్ఎస్ వైపు జనసైనికులు: మద్దతు కూడగట్టడంలో బండి, ధర్మపురి వైఫల్యం?

మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపటికి ఎన్నికలు పూర్తయి నాలుగవ తేదీన ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అయితే ఈ ఎన్నికల ప్రచార సరళి గమనించిన విశ్లేషకులు, జనసైనికుల మద్దతు కూడగట్టడంలో బిజెపి నాయకులు అయిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఘోరంగా వైఫల్యం చెందారని విశ్లేషిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడంవల్ల జనసైనికుల బలం పరిమితమే అయినప్పటికీ, ప్రతి ఓటు కూడా విలువైన ఎన్నికలలో జనసేన మద్దతు పూర్తిస్థాయిలో పొందలేకపోవడం బిజెపి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

ఎన్నికలు ప్రకటించిన నాటి నుండే ఇరు పార్టీల మధ్య పొసగని సఖ్యత:

దుబ్బాక ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తల కంటే జనసైనికుల హవా ఎక్కువగా కనిపించింది. అయితే దుబ్బాక గెలిచిన తర్వాత బండి సంజయ్ జనసేన పార్టీని కరివేపాకులా తీసి పడేస్తూ మాట్లాడిన తీరు జనసేన కు కోపం తెప్పించింది. జనసేన పార్టీ కూడా కేవలం 18 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయి జనసేన అభ్యర్థులు ను పోటీ నుండి విరమించుకునేలా చేయగలిగారు. పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన బిజెపికి మద్దతు ఇస్తుందని బహిరంగంగా ప్రకటించారు. ఈ నిర్ణయం జనసైనికుల ని నిరాశపరిచింది.

జనసైనికుల ని అడుగడుగునా అవమానించిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్:

కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఇలాంటి నేతలతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ బిజెపికి పూర్తి మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ, రెండు పార్టీల మధ్య హైదరాబాదులో సఖ్యత కనిపించలేదు. నిన్నటి అమిత్ షా రోడ్ షో సందర్భంగా బిజెపి జెండాలతో సమానంగా జనసేన జెండా లు ఎగురుతున్న వీడియో లతోపాటు, జనసైనికుల ని జెండాలు తీసివేయమని బండి సంజయ్ గదమాయిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ, జనసేన ని విరమింప చేసుకోమని బీజేపీ కోర లేదని, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా విరమించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జనసైనికులు, బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు పవన్ తో భేటీ అయ్యారో చెప్పాలి అంటూ ఆయన ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే ఈ రోజు ఎట్టకేలకు ఆయన జనసైనికులు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రోడ్ షో లో వ్యాఖ్యానించారు. కానీ గత మూడు నాలుగు రోజుల్లోనే ఆయన జనసేన పై చేసిన రకరకాల వ్యాఖ్యలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ, బిజెపి వైపు మొగ్గు చూపని జన సైనికులు:

జనసేన పార్టీ అభిమానులకు టిఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత ఉంది. 2019 ఎన్నికల సందర్భంలో తమ పార్టీలో చేర్చుకున్న ముఖ్యనేతలను టిఆర్ఎస్ పార్టీ బెదిరించింది అని, జనసేన లో చేరితే హైదరాబాదులో ఉన్న ఆస్తులకు భద్రత ఉండదు అని పెట్టింది అని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి టిఆర్ఎస్ అనేక రకాలుగా మద్దతు ఇస్తోందని, ఇలా రక రకాల కారణాలతో జన సైనికులకు టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. అయితే టిఆర్ఎస్ పట్ల అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ వైపు వారు మొగ్గు చూపేలా చేసుకోవడంలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో సఖ్యత గా మెలిగితే, ఎన్నికల్లో గెలిచాక వచ్చే క్రెడిట్ లో పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతో కొంత పాత్ర ఇవ్వాల్సి వస్తుంది ఏమో అన్న అభద్రతాభావం వారిలో ఉందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా టిఆర్ఎస్ పట్ల జనసైనికుల లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ధర్మపురి అరవింద్ బండి సంజయ్ విఫలమయ్యారు అనడంలో సందేహం లేదు.

టీఆర్ఎస్ లేదా నోటా వైపు మొగ్గు తున్న జనసైనికులు?

పవన్ కళ్యాణ్ పై ఏదో రకమైన ఒత్తిడి తెచ్చి తమ పార్టీ సభ్యులను బిజెపి పోటీ నుండి తప్పించింది అన్న భావన జనసైనికుల లో బలంగా ఉంది. పైగా బండి సంజయ్ ధర్మపురి అరవింద్ లాంటి నేతలు ఇంతగా రెచ్చగొడుతున్నా, ఎందుకు బిజెపికి ఓటు వెయ్యాలి అన్న భావన కూడా వారిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కు కానీ లేదంటే నోటా కి కానీ వేయడం బెటర్ అన్న భావనలో చాలావరకు జనసైనికులు ఉన్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండే చాలా ప్రాంతాలలో జనసైనికుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. వీరు ఒక అభ్యర్థిని పూర్తిస్థాయిలో గెలిపించే అంత ప్రభావం చూపక పోవచ్చు కానీ, ఓట్లు చీల్చడం ద్వారా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో అయితే చాలా ప్రాంతాలలో ఉన్నట్లు తెలుస్తుంది. దుబ్బాకలో అత్యంత రసవత్తరమైన పోటీలో కేవలం వెయ్యి ఓట్లు, అంటే ఒక శాతం కంటే తక్కువ మెజార్టీతో సీటు దక్కించుకున్న బీజేపీకి, ఒక్క ఓటు విలువ ఎంత బాగానే తెలిసి ఉండాలి.

ఏదేమైనా రేపటి ఎన్నికలలో జన సైనికులు బిజెపికి ఎంత వరకు ఓట్లు వేస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close