వైసీపీ ముద్ర చెరిపేసుకునే ఆసక్తి లేని ఏపీ బీజేపీ…!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలకు కేంద్ర నేతలు ఏం చెబుతున్నారో కానీ.. వారికి మాత్రం తమ పార్టీపై ఉన్న వైసీపీ ముద్ర చెరిపేసుకునే ఆసక్తి మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగినా.. మరొకటి జరిగినా…. బీజేపీ సమావేంలో మొదటగా జరిగే చర్చ ప్రభుత్వంపై పోరాటం. తమపై వైసీపీ ముద్ర ఉందని… దాన్ని చెరిపేసుకోవాలని అనుకోవడం. సోమవారం జరిగిన వర్చువల్ కార్యవర్గ భేటీలోనూ అలాగే నిర్ణయించుకున్నారు. బీజేపీ, వైసీపీ అంతర్గతంగా ఒక్కటే కాదన్న భావనను ప్రజల్లో కలిగించేందుకు కృషి చేసి, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సంస్ధాగతంగా పటిష్టం కావాలని తీర్మానించుకున్నారు. కానీ దాని కోసం ఏం చేయాలన్నదానిపైనేవారికి స్పష్టత లేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. సమావేశంలో పాల్గొన్న అందరూ చెప్పారు. ఏపీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమయిందని.. సోము వీర్రాజు కూడా గర్జించారు. ఇక రోడ్డెక్కాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. రాజకీయ తీర్మానంలో కూడా అలాగే ఉంది. కానీ..ఇది గత రెండేళ్లుగా చేస్తున్న ప్రకటనలే. ఒక్కరంటే ఒక్కరూ రోడ్డెక్కి ఏపీసర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పాపాన పోలేదు. ఇంకా చెప్పాలంటే.. సర్కార్ పై ఘాటు విమర్శలు చేస్తున్నవారిని పార్టీ నుంచి సాగనంపేస్తున్నారు. లేకపోతే సైలెంటయ్యేలా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో బీజేపీలోనే.. వైసీపీ ఉందని… వారిదే పైచేయి అవుతోందని అంటున్నారు.

నిజానికి బీజేపీలోకొంత మంది గతంలో ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. కన్నా లక్ష్మినారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వారందరూ వైసీపీసర్కార్ పై విరుచుకుపడేవారు. అయితే వైసీపీని విమర్శిస్తే.. టీడీపీకి లాభం అవుతుందని.. వారందరూ టీడీపీ కోసం పని చేస్తున్నరంటూ.. వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారంతోనే విజయసాయిరెడ్డి బీజేపీపై పట్టు సాధించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు… ఏపీ బీజేపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి గుప్పిట్లో ఉన్ారని అంటున్నారు. అందుకే కేంద్ర ఆలోచనలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు… రాజీలేని పోరాటం అంటారు కానీ.. దాన్ని ప్రారంభించరు. అందుకే బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close