రియల్ ఎస్టేట్ రంగంలో అతి పెద్ద సమస్య బిల్డర్‌తో ఒప్పందం చేసుకుని .. తర్వాత వివిధ కారణాలతో క్యాన్సిలేషన్ చేసుకుంటే కట్టిన డబ్బులు వాపసు తీసుకోవడం పెద్ద సమస్య అవుతుంది. ఎవరూ ఇవ్వరు. ముఖ్యంగా బిల్డర్ తప్పిదం వల్ల లోన్లు రాకపోయినా డబ్బులు ఇవ్వరు. ఇలాంటివి ఇక చెల్లవు. డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాల్సిందేనని తాజాగా రెరా ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్రలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఓ జంట ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. రెండు వాయిదాల్లో 7 లక్షలు చెల్లించారు. అయితే వారికి రుణం మంజూరు కాలేదు. వారు ఎన్నారైలు కావడంతో చాలా డాక్యుమెంట్లు సబ్ మిట్ చేయాల్సి వచ్చింది. కానీ వారు సమర్పించలేక లోన్ మంజూరుకాలేదు. దాంతో ఫ్లాట్ బుకింగ్ ను రియల్ ఎస్టేట్ సంస్థ రద్దు చేసింది. కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. వారు మహారాష్ట్ర రెరాలో ఫిర్యాదు చేశారు.
మహారేరా బుకింగ్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని విచారణ తర్వాత ఆదేశించింది. తాము రూల్స్ ప్రకారమే చేశామని రియల్ ఎస్టేట్ సంస్థ వాదించింది. లకానీ బుకింగ్ ఫారమ్‌లోని జప్తు నిబంధనలు హేతుబద్ధంగా లేవని రెరా స్పష్టం చేసింది. కొనుగోలు లోన్ ఆమోదం పొందడంపై ఆధారపడి ఉందని ఆ దంపతులు ముందుగానే ఆ కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. లోన్ రాకపోతే బుకింగ్ అమౌంట్ తిరిగి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ చూసి రెరా.. డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
వినియోగదారుల హక్కులు ఎక్కడైనా ఒకటే కాబట్టి.. ఈ విషయంలో ఎక్కడి వారికైనా ఈ తీర్పు వర్తిస్తుంది కాబట్టి.. బుకింగ్ అమౌంట్ కట్టి.. ఇల్లు కొనలేక డబ్బులు వదిలేసుకున్న ఎవరైనా ఉంటే.. వెంటనే రెరాలో ఫిర్యాదు చేయవచ్చు.