అఖిల్ కెరీర్లో అతి ముఖ్యమైన సినిమా ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. జూన్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే… ఈలోగానే ఈ సినిమా ప్రివ్యూ పడిపోయింది. నాగార్జున ఫైనల్ కట్ చూసేశారు. తన రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘జూన్ 26న సరికొత్త అఖిల్ ని చూడబోతున్నారన్న నమ్మకం నాకుంది’ అని నాగ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ‘డేట్ మార్క్ చేసుకోండి.. థియేటర్లలో కలుద్దాం’ అని అక్కినేని అభిమానులకు తీపి వార్త చెప్పారు నాగ్.
మే 1న విడుదల కావాల్సిన సినిమా ఇది. ‘పెద్ది’ జూన్ 30న వస్తుందేమో అని.. `లెనిన్’ వాయిదా వేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ మిగిలే ఉంది. అందుకే.. అనుకొన్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఇప్పుడు సినిమా మొత్తం పూర్తయ్యింది. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మే ద్వితీయార్థం నుంచి ప్రమోషన్ల పర్వానికి శ్రీకారం చుడతారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇది. నాగవంశీకి ప్రమోషన్ల విషయంలో తనకంటూ ఓ స్ట్రాటజీ ఉంటుంది. ఈసారి కూడా దాన్ని గట్టిగా వాడాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే జూన్ లో ‘పెద్ది’ నుంచి ఈ సినిమాకు ముప్పు ఉంది. పెద్ది ని కూడా సేమ్ ఇదే డేట్ కి రిలీజ్ చేయాలనుకొంటున్నారు. ఇప్పటికైతే ‘లెనిన్’ జూన్ 26న వస్తున్నట్టే. మార్పులేమైనా ఉంటే.. ఓ వారం ఆలస్యం అవుతుంది.