పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. బుధవారం బిల్లును లోక్ సభలో ప్రవేశ పెడతారు. ఏపీ రాష్ట్రాని చెందిన సభ్యులు ఇందులో యాక్టివ్ గా పాల్గొనడం సహజం. టీడీపీ వాళ్లు ఎలాగూ మాట్లాడతారు. మరి వైసీపీ ఏం చేస్తుంది? వైసీపీ బిల్లును సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? . ఇప్పుడు వైసీపీకి ఇదే పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పటి వరకూ కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులను వైసీపీ వ్యతిరేకించలేదు. అమరావతి విషయంలో ఏం చేయాలన్నది ఆ పార్టీకి వెరీ లాంగ్ క్వశ్చన్.
అసెంబ్లీలో తీర్మానానికి ఎగ్గొట్టినట్లుగా పార్లమెంట్ లో ఉన్న నలుగురు ఎంపీలు ఎగ్గొట్టడానికి అవకాశం లేదు. వెళ్లకపోతే సొంత రాష్ట్రంపై వారికి ఉన్న కన్సర్న్ ఇదేనా అని విమర్శలు వస్తాయి. నిజానికి తీర్మానానని వైసీపీ అధికారికంగా స్వాగతించలేదు. పైగా తీర్మానం చేసినప్పటి నుండి ప్రాంతీయ సెంటిమెంట్స్ ను రెచ్చగొట్టేలా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వైసీపీ బిల్లును వ్యతిరేకిస్తుందా, స్వాగతిస్తుందా అన్నది ఆసక్తి కరంగా మారింది.
బిల్లును స్వాగతించి రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ ను వినిపించాలన్న ఆలోచన కూడా ఆ పార్టీ పెద్దలు చేస్తున్నారు. అయితే ఇది కేవలం విభజన చట్ట సవరణ. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ విభజన చట్టంలో మారుస్తున్నారు. ఇందులో అమరావతికి భూములిచ్చినరైతులు, భూసేకరణ వంటి అంశాలు ఉండవు. అలాంటి డిమాండ్లు చేయడం కూడా అసందర్భం. అయినా కేంద్రం బిల్లును వ్యతిరేకించకుండా.. స్వాగతించకుండా.. మధ్యేమార్గంగా తప్పించుకోవడానికి వైసీపీకి ఉన్న మార్గం అదొక్కటే.
