ప్రొ.నాగేశ్వర్ : నెల రోజుల్లో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం దూకుడుగా ప్రారంభించారు. అసెంబ్లీ రద్దు చేసినప్పటి ఊపు ఇప్పుడు లేదని .. కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఇప్పుడు విభిన్నంగా ఉంది. ప్రభుత్వంపై కొన్ని రంగాల్లో సంతృప్తి ఉంది. ఉదాహరణకు… కరెంట్. కారణాలు ఏమైనా… కరెంట్ కొరత తెలంగాణకు లేదు. ఒక్క మెగావాట్ అదనంగా ఉత్పత్తి లేకపోయినా సరే.. పవర్ సమస్య దాదాపు లేకుండా చేశారు. రెండోది ఇరిగేషన్. ఇరిగేషన్ విషయంలోనూ ప్రజల్లో సానుకూతలత ఉంది. ప్రాజెక్టులు, రీడిజైనింగ్ పై కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తోంది. కానీ.. ప్రజలకు నీళ్లు అందితే.. వాటిల్లో అవినీతి జరిగిందా లేదా అన్నది పెద్దగా పట్టించుకోరు. అందుల్ల ఇరిగేషన్ వాటర్ ఎక్కడ రైతులకు అందిందో.. అక్కడ కొంత పాజిటివ్‌గా ఉన్న మాట నిజం. అలాగే ప్రజల్లో కొద్దిగా పాజిటవ్ గ్రౌండ్ లెవల్లో ఉంది.

అధికారం తప్ప వ్యవస్థాగత బలం టీఆర్ఎస్‌కు లేదా..?

సెప్టెంబర్ ఆరో తేదీన కేసీఆర్ అసెంబ్లీ రద్దు విషయాన్ని ప్రకటించారు. ఆ రోజుతో పోలిస్తే.. ఇప్పుడు ఊపు తగ్గింది. సర్వేలు చూసినా.. ఇంటలిజెన్స్ రిపోర్టుల ప్రకారం చూసినా టీఆర్ఎస్‌ పట్ల సెప్టెంబర్ ఆరో తేదీన ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పుడు లేదు. దానినికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా.. కిక్ స్టార్ట్ చేశారు. దాని.. కంటిన్యూటీ లేదు. కేసీఆర్‌కు పాజిటివ్ అంశాలతో పాటు.. కొన్ని సవాళ్లు ఉన్నాయి. మొదటి సవాల్.. మొదటిది పార్టీ నిర్మాణం. టీఆర్ఎస్ సభ్యత్వాలు పెరిగాయి. గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. కానీ అది కింది స్థాయిలో బలమైన పునాది పడినట్లు కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఒకప్పుడు… కాంగ్రెస్ పార్టీ తరహాలో నడుస్తోంది. అంటే… బలమైన నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు బలహీనం చేస్తూ ఉంటుంది. అసమ్మతిని రాజేస్తుంది. ఏ కాంగ్రెస్ పార్టీ నేతకైనా.. పార్టీ బలమే ఉండాలి కానీ.. వ్యక్తిగత బలం ఉన్న నేత ఉండకూడదనుకుంటారు. అంటే ఎవరూ కింది స్థాయిలో తిరుగులేని నాయకుడు ఉండకూడదన్నమాట. టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఒక్కరు కూడా.. నేరుగా గెలవగలిగే నేత లేరు. బలమైన నేతలు ఉంటే.. వారికి పోటీగా మరికొంత మంది నేతలు ఉన్నారు. ఇది 2014 లో లేదు. అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కారణంగా..టీఆర్ఎస్‌కు అధికారం వచ్చింది. గొప్ప మెజార్టీ రాలేదు. అలా రాకపోవడానికి కారణం… సంస్థాగత నిర్మాణం లేకపోవడం. ఈ ఐదేళ్లలో దీన్ని కేసీఆర్ బలపరుచుకోలేకపోయారు. కేసీఆర్ చుట్టూనే వ్యవస్థ నడుస్తోంది. అధికారం ఉన్నంత కాలం ఇది బలంగా ఉంటుంది. కానీ అధికారం లేకపోతే మాత్రం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. సరిగ్గా అదే పరిస్థితి టీఆర్ఎస్‌కు వస్తుందా..?

కేసీఆర్ సెంటమెంట్ రాజకీయాన్నే నమ్ముకుంటున్నారా..?

ఇక రెండోది… ఇప్పటికీ కూడా కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయమే చేస్తాను అంటున్నారు. గత ఎన్నికల్లో సెంటిమెంట్ తో విజయం సాధించారు. అయితే మధ్యలో సీమంధ్ర ఓటర్ల కోసం ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు టీడీపీపై దాడి చేస్తున్నారు. అంటే.. ఇప్పుడు కూడా సెంటిమెంట్ రాజకీయమే చేస్తానంటున్నారు. ఇది ఎంత వరకు ఫలిస్తుంది ..అనేది సందేహం. ఎంత అభివృద్ధి చేసినా.. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఇప్పుడు ఎన్నికల ట్రెండ్ ప్రకారం… భావోద్వేగాల ప్రకారమే ఓట్లు వేస్తున్నారు. ప్రజాసమస్యల కన్నా.. ఎమోషన్స్ మీద ఎక్కువ ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరిగ్గా చేసుకోలేకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడతాయి. మూడోది.. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌పై వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అందుకే.. ఓటు వేయబోయేది తనకు అన్నట్లుగా… చెప్పుకొస్తున్నారు. అంటే.. ఎన్నికలని.. తన పాలనపై రిఫరెండంగా మార్చబోతున్నారు. తన నాయకత్వం కావాలా వద్దా అన్నదానిపైనే ఎన్నికలు జరిగేలా చేయబోతున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఓటు వేయడం లేదు. తనకు ఓటు వేయమంటున్నారు. నియోజకవర్గాల్లో… ఎమ్మెల్యేలపై వ్యతిరేకత… పార్టీపై ప్రభావం పడకుండానే… తనకు మాత్రమే ఓటు వేయమన్నట్లుగా.. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తూంటే.. అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిపై వ్యతిరేకతతో.. టీఆర్ఎస్ కు వ్యతిరేకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మహాకూటమిపై కేసీఆర్‌కు అంత కంగారెందుకు..?

మహాకూటమి కూడా టీఆఎస్ ఆలోచనల్లో మార్పు తెచ్చిందని అనుకోవాలి. మహాకూటమి ఓ ఫోర్స్ కాకపోతే.. టీఆర్ఎస్ ఇంత సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం లేదు. కానీ మహాకూటమి కట్టడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేము. కానీ.. మహాకూటమి వల్ల బలాలు పోగవుతాయి. చిన్నాచితకో.. కొద్దో గొప్పో… బలం పోగవడం వల్ల… బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవడం వల్ల టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేము. రాజకీయ ఫలితం మొత్తం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు కన్సాలిడేట్ అవుతాయా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. క్యాస్ట్ కన్సాలిడేషన్, సీమాంధ్ర ఓట్లు అన్నీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం వస్తోంది. యాంటీ మోడీ సెంటిమెంట్ ప్రభావం చూపితే.. టీఆర్ఎస్‌కు మైనస్ అవుతంది.

నెలలో కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందన్నది మాత్రం నిజం..!

అలాగే.. ముందస్తు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారు..? . టీఆర్ఎస్‌లో పెరుగుతున్న అసమ్మతి కూడా… టీఆర్ఎస్ పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో పాటు.. కుటుంబంలో ఉన్న విబేధాలు కూడా ఇబ్బందికరమే. హరీష్ రావును దూరం పెడుతున్నారు. కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్నారు. అంతుక ముందు పొలిటికల్ మేనేజ్ మెంట్ హరీష్ చేసేవారు. ఇప్పుడు కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోయారు. ఇది టీఆర్ఎస్ క్యాడర్ లో అయోమయం ఏర్పడింది. కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఓడిపోతారని చెప్పలేము కానీ సవాళ్లు మాత్రం ఉన్నాయి. కేజీ టు పీజీ విద్య, ఉద్యోగాలు, సహా అనేక అంశాల్లో… ప్రజల్లో అసంతృప్తి ఉంది. కాంగ్రెస్ వీటిని ఉపయోగించుకోగలిగితే… కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. పూర్తిగా చూస్తే… సెప్టెంబర్ ఆరో తేదీన ఉన్నంత ఊపు మాత్రం ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close