ఇదీ కేసీఆర్ మార్క్ కుటుంబ ప్రాధాన్య‌త‌..!

ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ తెరాస స‌ర్కారుపై చేసే విమ‌ర్శ‌ల్లో ప్ర‌ధాన‌మైంది… కేసీఆర్ కుటుంబ పాల‌న‌! తెలంగాణ వ‌చ్చాక ఆ కుటుంబంలో న‌లుగురికీ మేలు జ‌రిగిందే త‌ప్ప‌, సామాన్యుల‌కు ఒరిగిందేదీ లేద‌నేది కాంగ్రెస్ తో స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలాసార్లు విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటాయి. అయితే, ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్దాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించుకున్న త‌రువాత కూడా రాజ‌కీయంగా ముందుగా వారి కుటుంబ స‌భ్యుల‌కే వ‌రుస ప్రాధాన్య‌త ఇస్తున్న ఈ తీరుని ప్ర‌తిప‌క్షాలు గ‌మ‌నించాయో లేదో..! అసెంబ్లీ ర‌ద్దు చేద్దామని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నాక‌.. ముందుగా మంత్రి కేటీఆర్ కి ప్రాధాన్య‌త ఇచ్చారు! ఆ త‌రువాత‌, మేన‌ల్లుడూ మంత్రి హ‌రీష్ రావుకి ప్రాధాన్య‌త ద‌క్కింది! ఇప్పుడు, కుమార్తె, ఎంపీ క‌విత‌కు ప్ర‌ముఖ స్థానం క‌ల్పించారు..!

హైద‌రాబాద్ లోని కొంగ‌ర క‌లాన్ స‌భ గుర్తుండే ఉంటుంది..! ప్ర‌గ‌తి నివేద‌న స‌భ నుంచే ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి తెలంగాణ‌లో తారస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు నాయ‌క‌త్వం వ‌హించి ఏర్పాట్లు చేసిందెవ‌రూ… కుమారుడు కేటీఆర్‌. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ స‌మ‌యంలో మంత్రి హ‌రీష్ రావుకు ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌న్న విమ‌ర్శ‌లు వెంట‌నే గుప్పుమ‌న్నాయి. అయితే, ఆ త‌రువాత హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. దీనికి నాయ‌క‌త్వం వ‌హించింది ఎవ‌రు… కేసీఆర్ మేన‌ల్లుడూ, మంత్రి హ‌రీష్ రావు. తాజాగా నిజామాబాద్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌కు నాయ‌క‌త్వం వ‌హించిందెవ‌రు… ముఖ్య‌మంత్రి కుమార్తె, ఎంపీ క‌విత‌..!

దీన్ని రాజ‌కీయంగా తెరాసలో వారసత్వ ప్రాధాన్య‌త క్ర‌మం అని వ్యాఖ్యానించలేంగానీ… కుటుంబంలోని ఉన్న‌వారికి వ‌రుస‌గా కీల‌క ఎన్నిక‌ల స‌భ‌ల్లో ప్ర‌ముఖ పాత్ర‌ను కేసీఆర్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం! అయితే, ఈ ముగ్గురూ ఈ మూడు స‌భ‌ల్నీ విజ‌య‌వంతం చేశార‌న‌డంలోనూ సందేహం లేదు. భారీ ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ‌లో స‌క్సెస్ అయ్యారు. కుటుంబ పాల‌న అని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నా కూడా… ఇలా వ‌రుస‌గా త‌నవారికే కేసీఆర్ ప్రాధాన్య‌త క‌ల్పించ‌డం విప‌క్షాల‌కు ఒక విమ‌ర్శ‌నాస్త్రంగా మారే అవ‌కాశం ఉంద‌నే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close