తెలకపల్లి రవి : జాగ్రత్త పాటించని జగన్‌ బాణీ మార్చిన బాబు

Telakapalli-Raviతుని ఘటనలపై ప్రతిపక్ష నాయకుడు జగన్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను తిప్పికొట్టడం వరకూ ఒకె. కాని ఆ వూపులో కనీస జాగ్రత్త పాటించకుండా దాడి చేశారు. వంగవీటి మోహన రంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు అనేబదులు చంపిన వారు, ముద్దాయిలు అని ఒకటికి రెండు సార్లు మాట్లాడారు. ఈ ఆరోపణలను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రి ఉమా మహేశ్వరరావు వెంటనే ఖండించారు. అసలు జగన్‌ దేవినేని సోదరుల పేర్ల విషయంలో గందరగోళానికి గురైనట్టు కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ఘటనతో సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం ఒకటైతే జగన్‌ మరింత ముందుకు పోయి ఆర్థికాభివృద్ది లెక్కలు వగైరా వల్లించారు. ఇవన్నీ ప్రస్తుతాంశానికి సంబంధం లేనివే.

మరో వైపు చంద్రబాబు నాయుడు రెండవ రోజు కూడా సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. అంతసేపు అదే అంశం సాగదీసి చెప్పడం వల్ల కొంత ఆత్మరక్షణలో వున్నారనే భావం కలిగించారు. కాపులను కులంగా ప్రస్తావించి వారిపట్ల గౌరవం అంటూనే దాన్ని వివరించడంలో తడబాటుకు గురైనారు. ఇదంతా కూడా పెద్ద విషయం లేకుండా సాగదీసినందువల్ల జరిగిందే. పట్టిసీమ నుంచి కాల్‌మనీ వరకూ కలగాపులగం చేయడం సరికాదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వాటిని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆందోళన కారులను పిలిచి చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి నుంచి వచ్చివుంటే బావుండేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్ని తేడాలున్నా చర్చలు సంప్రదింపులు తప్పని సరి. తాము చర్చలకు పిలిచినా అవతలి వారు రాకపోతే వేరేవిషయం గాని ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనలేకపోవడం పొరబాటవుతుంది. రిజర్వేషన్ల కల్పన సులభంగా జరిగిపోయేది కాదనే సంకేతం మాత్రం చంద్రబాబు మాటల్లో వుంది.

పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన దానిలో ప్రభుత్వ వైఫల్యం, నిర్వాహకుల అజాగ్త్రత్త గురించి ఎత్తిచూపడం బాగానే వుంది. అయితే తాను ఏ ఒక్క వర్గానికో నాయకుడిగా గాక అందరి తరపున పెద్ద మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తన పునాదిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడ్డం కూడా అర్థమవుతూనే వుంది. లేకపోతే ఆఘమేఘాల మీద షూటింగు మానుకుని రావలసిన అవసరం లేదు. రిజర్వేషన్ల కల్పనపై ఆ శలు కల్పించడం వల్లనే వారు అంతమంది వచ్చారని ఆయన స్పష్టంగానే చెప్పారు. అయితే కమిషన్‌ ఏర్పాటు దాని సిపార్సుల వంటి విషయాల్లో మాత్రం స్పష్టత లేదనిపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close