స్టాక్ మార్కెట్‌లో అమరావతి బాండ్లు లిస్టింగ్..! అద్భుతమేనా..?

దేశంలో ముందెన్నడూ లేని విధంగా ఒక రాజధాని నిర్మాణం కోసం జారీ చేసిన బాండ్లకు అపూర్వ ఆదరణ లభించింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో ఎలక్ర్టానిక్ బిడ్డింగ్ ఫ్లాట్ ఫాం పై అమరావతి క్యాపిటల్ బాండ్లు 1.5 రెట్లు ఎక్కువ ట్రేడ్ అయ్యాయి. బాండ్లను రూ. 1300 కోట్ల సేకరణకు జారీ చేయగా.. ఒకటిన్నర రెట్లు అధికంగా ట్రేడ్ అయింది. బాండ్లను అధికారికంగా కేటాయించడంతో రూ. 2వేల కోట్లు సీఆర్డీఏ అకౌంట్లో జమ అయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో అమరావతి బాండ్లు లిస్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. సెరిమోనియల్ బెల్ ను మోగిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చిన ఈ బాండ్లకు క్రిసిల్ ఎ ప్లస్ రేటింగ్ ఇచ్చింది. ఈ బాండ్లను కొనుగోలు చేసిన మదుపరులకు ప్రతి ఏడాది వడ్డీ చెల్లించడంతో పాటు ఆరవ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 20 శాతం చొప్పున చెల్లిస్తూ ఉంటారు. అమరావతి బాండ్లకు వచ్చిన ఆదరణతో ప్రభుత్వం వీటిని లిస్టింగ్ చేయడంతో పాటు మూడు నెలల తరువాత సింగపూర్, లండన్ స్టాక్ ఎక్సేంజ్ లో కూడా లిస్టింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుండటంతో మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనుల కోసం నిధులు అవసరం ఎక్కువగా ఉంది. ఇందుకోసం రిటైల్ బాండ్లు, మసాలా బాండ్లు కూడా విడుదల చేసేందుకు అధారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు విలువ గల రిటైల్ బాండ్లను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరు, రైతులు ఇచ్చిన 33వేల ఎకరాల భూమి, రహదారుల నిర్మాణం జరుగుతున్న తీరును ఇన్వెస్టర్లు అంతా పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక స్థానిక సంస్థ విడుదల చేసిన బాండ్లకు ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం చంద్రబాబు ఇమేజ్ వల్లే సాధ్యమయిందని..సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే..ఈ బాండ్ల విషయంలో వస్తున్న విమర్శలు తక్కువేం కాదు. కానీ అమరావతి కోసం.. ఎంత వడ్డీకి అప్పు తీసుకున్నా.. చెల్లించగలమనే ధీమాలో ప్రభుత్వం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close