నాడు చాయ్ వాలా… నేడు చౌకీదార్..! సామాన్యుల్లో సామాన్యుడిగా మోడీ..!

ప్రచార వ్యూహాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్టైలే వేరు. ఆయన 2014 ఎన్నికలకు ముందు అమలు చేసిన ప్రచార వ్యూహం.. అత్యంత విభిన్నం. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే ప్రతి విమర్శను.. ఆయన తన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు.. రైల్వే స్టేషన్‌లో మోడీ టీ అమ్ముకున్నారన్న ఓ ప్రచారం ఉంది. ఆ విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ.. అవసరమైన సందర్భంలో మాత్రం… చాయ్ వాలా పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నేతలు చేసిన చాయ్ వాలా విమర్శలను మోడీ.. పక్కాగా ఉపయోగించుకున్నారు. చాయ్ పే చర్చా పేరుతో..ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సారి కూడా.. అలాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.

తాను దేశానికి కాపలాదారునని.. మోడీ చాలా కాలంగా చెబుతున్నారు. ఆ కాపలాదారు దొంగ.. అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నినదిస్తున్నారు. ఈ క్రమంలో మోడీ… గత ఎన్నికల నాటి వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సోషల్‌ మీడియా వేదికగా “మై భీ చౌకీదార్‌” పేరిట ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్‌ పేరును “చౌకీదార్‌ నరేంద్ర మోడీ”గా మార్చారు. ఒక్క మోడీ మాత్రమే… కాదు.. బీజేపీ మద్దతుదారులందరూ.. ఇలా పేరు మార్చుకోవాలని ఆదేశించారు. దాంతో అమిత్ షా సహా.. అందరూ అదే బాట పట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో… చౌకీదార్ ట్రెండింగ్ టాపిక్ అయింది. బీజేపీ ప్రారంభించిన ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కూడా చౌకీదార్ చోర్ హై అనే ప్రారంభించింది.

ప్రచారం విషయంలో.. మోడీని ఢీకొట్టే సామర్ధ్యం విపక్ష పార్టీల నేతల్లో ఎవరికీ లేదు. మూడు నెలల ముందునే మోడీ ప్రచార భేరీ మోగించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయన ప్రసంగించబోతున్నారు. అద్భుతమైన హావభావాలు, వాగ్ధాటితో ఆయన ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close