అక్కడ కొబ్బరి `చెట్టే’ కాదు !

కొబ్బరి చెట్టుని `కొబ్బరి చెట్టు’ అనకుండా మరేమంటాం ! అది చెట్టే కాదంటే ఎలా ? ఇలాంటి సందేహాలు మీకీపాటికి వచ్చే ఉంటాయి. మన కోస్తాలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నట్లుగానే, పశ్చిమాన అరేబియా సముద్రతీరం వెంబడున్న గోవా తీరప్రాంతంలో కొబ్బరి చెట్లకు కొదవేలేదు. అలాంటి గోవాలో కొబ్బరి చెట్టుని అసలు `చెట్టే’కాదు పొమ్మంటున్నారు. ఎవరో అనడంకాదు, ఏకంగా గోవా ప్రభుత్వమే కొబ్బరికి ఇంతకాలంగా ఉన్న `చెట్టు’ హోదా తొలగించేసింది. ఇందుకోసం 1984నాటి చట్టాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. ఇంతకీ ఎందుకింత హడావుడి… ఆ వివరాల్లోకి వెళితే…

గోవా- డయూ- డమన్ చెట్ల పరిరక్షణ చట్టం (1984)లో సవరణ చోటుచేసుకోవడంతో ఇక ఇప్పుడు కొబ్బరి చెట్టుని `ట్రీ’గా పరిగణించాల్సిన అవసరమేలేదు. గోవాలో కొబ్బరి చెట్లు బాగా పెరుగుతుంటాయి. అవి ఒక్కొసారి విరిగిపడుతుంటాయి. ఒకరింట్లో పెరుగుతున్న కొబ్బరి చెట్టు పక్క ఇంటివైపుకు వంగి పడిపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. దీంతో పొరిగింటి కొబ్బరి చెట్టు వల్ల ఆస్తి నష్టం కలిగి లబోదిబోమన్నవారూ ఉన్నారు. ఇలాంటి అనేక ఫిర్యాదులు అధికారుల వద్ద కోకొల్లలు. కొబ్బరి చెట్టు సృష్టిస్తున్న సమస్యతో అధికారులు తలలు పట్టుకున్నారు. కొబ్బరి చెట్టుని చట్ట ప్రకారం నరకడం పెద్ద తప్పు. అది వృక్ష సంపదను నాశనం చేసిన నేరం క్రిందకు వస్తుంది. అటవిశాఖ అనుమతి లేనిదే కొబ్బరి చెట్టును ఎవ్వరూ నరకలేని పరిస్థితి.

ఈ సమస్యకు పరిష్కారం దిశగా గోవా ప్రభుత్వం చట్లంలో సవరణ తీసుకువచ్చింది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తితే గోవా వృక్ష సంరక్షణ చట్ట సవరణ ప్రకారంగానే కొబ్బరి చెట్లను తొలగించే అవకాశం ఏర్పడింది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా కొబ్బరి చెట్టకున్న `ట్రీ’ హోదాను తొలగిస్తూ కొత్త అర్థం చెప్పింది. ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ జరిగిపోయింది. ఇకపై కొబ్బరి `చెట్టు’ కాదుకనుక ఎవరైనా దాన్ని అడ్డంగా నరికేయవచ్చు. పైగా, `చెట్టు’ అంటే నిర్వచనం ఇస్తూ, పెద్ద మాను ఉండి, దానికి శాఖలు ఉంటేనే అది చెట్టు అవుతుందని తేల్చి చెప్పారు. కొబ్బరికి పెద్ద మాను ఉండదు, పైగా కొమ్మలు అసలే ఉండవు. కనుక దీనికి ఇంతకాలంగా ఉన్న చెట్టు హోదాను కూకటి వేళ్లతో సహా పీకివేశారు. అలా గోవాలో కొబ్బరి చెట్టు తన హోదాను కోల్పోయింది. సమస్య పరిష్కారమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close