గ్రేటర్ లో పాగాకు గేమ్ ప్లాన్ రెడీ?

తెరాస కారు జోరు మీదుంది. 12 ఎం ఎల్ సి సీట్లలో 10 గెల్చుకుని సెలెబ్రేషన్ మూడ్ లో ఉంది. ఇదే ఊపులో గేటర్ హైదరాబాద్ ను హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. ఆరు నూరైనా మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి స్కెచ్ రెడీ అయినట్టు సమాచారం.

మొదటి నుంచీ తెరాసకు హైదరాబాద్ కొరకరాని కొయ్యగానే ఉంది. అనుకున్న స్థాయిలో కేడర్ బలపడలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లు దక్కాయి. ఎంపీ సీటు ఒక్కటీ దక్కలేదు. అయితే, గత ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీగా కాస్త బలం పుంజుకుంది. ఇతర పార్టీల నుంచి కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. తలసాని వంటి నేతల వలసల కంటే ద్వితీయ శ్రేణి నాయకుల వల్లే పార్టీ బలం పెరిగిందనే టాక్ ఉంది.

హైకోర్టు తీర్పు ప్రకారం జనవరి ఆఖరు కల్లా ఎన్నికలు ముగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, ఈసారి ఎవరు గెలుస్తారనేది రాజకీయ పార్టోల్లోనే కాదు, సామాన్య జనంలోనూ ఆసక్తికరంగా మారింది. తెరాస వర్గాల సమాచారం ప్రకారం, మేయర్ పదవిని అధికార పార్టీ గెల్చుకోవడం ఖాయమంటున్నాయి గులాబీ శ్రేణులు. అందుకోసం పక్కా లెక్కలతో పకడ్బందీ స్కెచ్ వేశారట.

దాదాపు 36 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జి.హెచ్.ఎం.సి.ని ఆప్ట్ చేసుకున్నారు. అంటే మేయర్ ఎన్నికల్లో వారంతా ఓటు వేస్తారు. తాజాగా గెలిచిన ఎమ్మల్సీలు చాలా మంది గ్రేటర్ నే ఎంచుకుంటారని తెలుస్తోంది. అంటే 40కి పైగా ఓట్లు అప్పుడే తెరాస జేబులో ఉన్నాయన్న మాట. ఏదో ఒక ఒప్పందంతో ఎం.ఐ.ఎం. కూడా తెరాసకు మద్దతిస్తుందని గులాబీ శ్రేణులు ఘంటాపథంగా చెప్తున్నాయి. డివిజన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ ఓట్లతో కలిసి ఆ పార్టీ వల్ల దాదాపు 50 ఓట్లు ఖాయమని అంచనా. అంటే 90 నుంచి 100 ఓట్లు అప్పుడే గులాబీ శిబిరానికి అడ్బాన్న్ బుకింగ్ అయినట్టే. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఎన్ని డివిజన్లలో విజయం సాధిస్తుందనేది ప్రశ్న. వారు అనుకున్నట్టుగా 75 గెలవకపోయినా, కనీసం 50 సీట్లు గెలవకపోయినా 30-40 మధ్య గెలిచినా మేయర్ పదవిని సునాయాసంగా గెల్చుకోవచ్చు.

ఇదీ, గులాబీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాట్. అందుకే ఆ పార్టీ టికెట్ల కోసం పోటీ భారీగానే ఉంది. డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రకటన రాగానే టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. అనుకూలమైన రిజర్వేషన్ రాని నేతలు మినహాయించి, మిగతా వారిలో ప్రతి డివిజన్ నుంచి చాలా మందే టికెట్లు ఆశిస్తున్నారు. ఈ టికెట్ల పంపిణీ వ్యవహారాన్ని కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాని తెలుస్తోంది. ఇప్పటికే జరిపిన సర్వేల రిపోర్టులను క్రోడీకరించి, అన్ని అంశాలను పరిశీలించాకే టికెట్లు ఇస్తారట. ఆర్థికంగా బలవంతులతో పాటు స్థానికంగా పరిచయాలు, మంచి పేరున్న వారికి ప్రాధాన్యం లభించ వచ్చంటున్నారు. మొత్తానికి, హైదరాబాదులో తెరాస వీక్ అనే టాక్ ను పటాపంచలు చేయడానికి పక్కా స్కెచ్ రెడీగా ఉంది. దీన్ని అమలు చేయడమే తరువాయి అని తెరాస నాయకులు ధీమాగా చెప్తున్నారు. ఇంతకీ ఈ గేమ్ ప్లాన్ యథాతథంగా అమలవుతుందా లేక ఏమైనా ఊహించని ట్విస్టులు ఎదురవుతాయా వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close