అమిత్ షాకూ ప్రశ్నలే ప్రశ్నలు !

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు బహిరంగసభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాకు కాంగ్రెస్ , టీఆర్ఎస్ నేతలు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొదటగా కేటీఆర్ అమిత్‌షాకు 27 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు బీజేపీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. ఇరవై ఏడు ప్రశ్నలన్నీ.. కేంద్రం నుంచి తెలంగామకు రావాల్సిన ప్రాజెక్టులు.. ప్రయోజనాలు.. నిధులకు సంబంధించినవే. ప్రతిసారి వచ్చి స్పీచులు ఇచ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని ఈ సారి సమాధానం చెప్పాల్సిందేనన్నారు.

ఇక కేటీఆర్ సోదరి.. ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు. ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌తో కలిసి తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మరో లేఖ రాశారు.

అమిత్ షాకు ఇలా తెలంగాణ అగ్రనేతలందరి నుంచి ప్రశ్నలు వెళ్లాయి. ఈ ప్రశ్నలేనే ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియాలో సర్క్యూరేట్ చేస్తున్నారు. అమిత్ షాను ప్రశ్నిస్తూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారో లేదో వేచి చూడాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close